‘ట్రాక్టర్లు, వరికోత మిషన్లు అధికార పార్టీ నాయకులకేనా?’

ABN , First Publish Date - 2022-06-08T05:22:02+05:30 IST

వైఎ్‌సఆర్‌ యంత్రసేవా పథ కం కింద ఇచ్చే ట్రాక్టర్లు, వరికోత మిషన్లు అధికార పార్టీ నాయకులకేనా అని ఏపీ రె ౖతు సంఘం జిల్లా ప్రధాన కా ర్యదర్శి బి.దస్తగిరిరెడ్డి ప్రశ్నిం చారు.

‘ట్రాక్టర్లు, వరికోత మిషన్లు అధికార పార్టీ నాయకులకేనా?’
మాట్లాడుతున్న దస్తగిరిరెడ్డి

కడప(సెవెనరోడ్స్‌), జూన 7: వైఎ్‌సఆర్‌ యంత్రసేవా పథ కం కింద ఇచ్చే ట్రాక్టర్లు, వరికోత మిషన్లు అధికార పార్టీ నాయకులకేనా అని ఏపీ రె ౖతు సంఘం జిల్లా ప్రధాన కా ర్యదర్శి బి.దస్తగిరిరెడ్డి ప్రశ్నిం చారు. మంగళవారం విడుదల చేసిన 268 ట్రాక్టర్లు, 341 యంత్ర పరికరాలు, 16 వరి కోత మిషన్లు అన్నీ అధికార పార్టీ నాయకులకే చెందాయన్నారు. మంగళవారం రైతు సంఘం జిల్లా కార్యాలయంలో నిర్వ హించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్ర పరికరాలు, పనిముట్లు కావాలని ఆర్‌బీకే కేంద్రాలలో రైతుల పేర్లు నమోదు చేయించుకున్నారని, అయితే ఇందులో చాలా మందికి రాలేదన్నారు. అధికార పార్టీ అండదండలు ఉన్న వారికి మాత్రమే అందాయన్నారు. గ్రామాలలో సర్పంచలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, బినామీ పేర్లతో ట్రాక్టర్లు, వరి కోత మిషన్లు తీసుకున్నారని, ఆయన తెలిపారు. రైతులను ఎంపిక చేయడంలో వ్యవసాయాధికారులు రాజకీయ నాయకులకు తలొగ్గారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. మంజూరైన 16 వరికోత మిషన్లలో రాజకీయ అవినీతి చోటుచేసుకుందన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతు భరోసా కేంద్రాలలో నమోదు చేయించుకున్న అర్హులైన రైతులకు పరికరాలు, ట్రాక్టర్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. జిల్లా ఉన్నతాధికారులు విచారించి అర్హులైన రైతులందరికీ ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడుగోపాలకృష్ణయ్య పాల్గొన్నారు.

Read more