ఎనర్జీ అసిస్టెంట్లు సచివాలయ ఉద్యోగులా? విద్యుత్‌ ఉద్యోగులా?

ABN , First Publish Date - 2022-09-12T05:08:00+05:30 IST

ఎనర్జీ అసిస్టెంట్లు సచివాలయ ఉద్యోగులా, లేక విద్యుత్‌ సంస్థ ఉద్యోగులా అని యునైటెడ్‌ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. సుదర్శన్‌ రెడ్డి, సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు కామనూరు శ్రీనివా సుల రెడ్డి ప్రశ్నించారు.

ఎనర్జీ అసిస్టెంట్లు సచివాలయ ఉద్యోగులా?  విద్యుత్‌ ఉద్యోగులా?

కడప(సెవెన్‌రోడ్స్‌), సెప్టెంబరు 11 :  ఎనర్జీ అసిస్టెంట్లు సచివాలయ ఉద్యోగులా, లేక విద్యుత్‌ సంస్థ ఉద్యోగులా అని యునైటెడ్‌ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. సుదర్శన్‌ రెడ్డి, సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు కామనూరు శ్రీనివా సుల రెడ్డి ప్రశ్నించారు.   నగరంలోని యూటీఎఫ్‌ భవనంలో ఆదివారం  ఎనర్జీ అసిస్టెంట్ల (జేఎల్‌ఎం గ్రేడ్‌-3) జిల్లా సదస్సు  నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎనర్జీ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని, విద్యుత్‌ ఉద్యోగుల లాగానే వీరికి హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.  మండలంలో ఎక్కడి నుండి అయినా బయోమెట్రిక్‌కు సడలింపు ఇవ్వాలని, పెండింగ్‌  వేతనాలు వెంటనే చెల్లించడంతోపాటు, వారి ఉద్యోగాలను  రెగ్యులరైజ్‌ చేయాలన్నారు. పో లీస్‌ వెరిఫికేషన్‌ త్వరగా చేయాలని , విద్యుత్‌ ఉద్యోగులకు ఇస్తున్న మెడికల్‌ అలవెన్స్‌, ట్రావెలింగ్‌ అలవెన్స్‌ ఇతర సదుపాయాలు కల్పించాలని, ప్రమాదాలు జరిగితే  ఎక్స్‌గ్రేషియాతో పాటు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షుడు నాయబ్‌ రసూల్‌, యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.శివశంకర్‌, ఉపాధ్యక్షులు శ్రీహరి, నాయకులు సురేంద్రబాబు, ఎరికుల రెడ్డి, నాగసుబ్బయ్య, రామమోహన్‌, నందీశ్వరుడు, శివప్రసాద్‌, ఎన ర్జీ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. 

Read more