రేపు కర్నూలులో ఏపీఆర్‌జేసీ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2022-09-11T05:25:50+05:30 IST

ఏపీఆర్‌జేసీ ఎంట్రన్స్‌లో అర్హత సాధించి ఇప్పటి వరకు సీటు పొందని వారికి ఈనెల 12న కర్నూలులో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు కేవీపల్లె మండలం గ్యారంపల్లె గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ శివయ్య శనివారం తెలిపారు.

రేపు కర్నూలులో ఏపీఆర్‌జేసీ కౌన్సెలింగ్‌

పీలేరు, సెప్టెంబరు 10: ఏపీఆర్‌జేసీ ఎంట్రన్స్‌లో అర్హత సాధించి ఇప్పటి వరకు సీటు పొందని వారికి ఈనెల 12న కర్నూలులో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు కేవీపల్లె మండలం గ్యారంపల్లె గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ శివయ్య శనివారం తెలిపారు. రాయలసీమలోని బాలుర కొరకు అన్నమయ్య జిల్లాలోని గ్యారం పల్లె, శ్రీసత్యసాయి జిల్లాలోని కొడిగెనహళ్లి, బాలికల కోసం కర్నూ లు జిల్లాలోని బనవాసి గురుకుల కళాశాలల్లో ఖాళీలు ఉన్నాయని ఆయన తెలిపారు. సీటు కావాల్సిన విద్యార్థులు ఈ నెల 12న కర్నూలులోని ఏపీఆర్‌జేసీ(ఉర్దూ-బాయ్స్‌)లో ఉదయం 9 గంటల కు జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలన్నారు. కౌన్సెలింగ్‌లో పాల్గొ న్న విద్యార్థులు గ్యారంపల్లె, కొడిగెనహళ్లితోపాటు నాగార్జునసా గర్‌లో కూడా అడ్మిషన్లు పొందవచ్చునన్నారు. మరిన్ని వివరాల కు ఏపీఆర్‌ఎస్‌.ఏపీసీఎఫ్‌.ఇన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

Read more