గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ నియామకాలు రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-09-27T05:23:46+05:30 IST

అంగన్‌వాడీ గ్రేడ్‌ 2 సూపర్‌ వైజర్ల నియామకాలు రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలని జిల్లా సీఐటీయూ కార్యదర్శి రామాంజులు డిమాండ్‌ చేశారు.

గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ నియామకాలు రద్దు చేయాలి
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న మున్సిపల్‌ యూనియన్‌ వర్కర్లు

రాయచోటి(కలెక్టరేట్‌), సెప్టెంబరు 26: అంగన్‌వాడీ గ్రేడ్‌ 2 సూపర్‌ వైజర్ల నియామకాలు రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలని జిల్లా సీఐటీయూ  కార్యదర్శి రామాంజులు డిమాండ్‌ చేశారు. సోమవారం అన్న మయ్య జిల్లా కలెక్టరేట్‌ వద్ద సూపర్‌ వైజర్‌ పరీక్ష రాసిన అభ్యర్థులతో  ధ ర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్‌వైజర్‌ పరీక్షకు సంబంధించిన ఫలితాలు విడుదల చేయకుండా, కీ ప్రకటించకుండా రోస్టర్‌ పద్ధతి పాటించకుండా,  కాల్‌ లెటర్‌ సైతంనే లేకుండానే అభ్యర్థులను ఎంపిక చేశారన్నారు. ఈ నియామకాలపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఈ నియా మకాలను రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.భాగ్యలక్ష్మి, సిద్దమ్మ, సుకుమారి, సునంద, గంగాదేవి, అమ్ములమ్మ, రెడ్డెమ్మ, పార్వతి, రమీజా, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.

రైల్వేకోడూరు: అంగన్వాడీ గ్రేడ్‌-2 పరీక్షా ఫలితాలను గోప్యంగా ఉంచడం సరికాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. సోమవారం రైల్వేకోడూరు ఐసీడీఎస్‌ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   ఈ నెల 18న నిర్వహించిన పరీక్షల ఫలితాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచిందన్నారు. పరీక్ష కీ విడుదల చేయాలని, రోస్టర్‌ ప్రకారం మెరిట్‌ జాబితా ప్రకటించాలని, అందరకీ న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు

Read more