15లోగా వైద్యుల నియామకం

ABN , First Publish Date - 2022-09-28T04:07:42+05:30 IST

ఏపీ వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఆసుపత్రులలో కొరత ఉన్న వైద్యులు, స్టాఫ్‌ నర్సుల నియామకాన్ని అక్టోబరు 15వ తేదీలోగా పూర్తి చేస్తామని డిస్ట్రిక్ట్‌ కో-ఆర్డినేటర్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీసీహెచ్‌ఎ్‌స) డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.

15లోగా వైద్యుల నియామకం
సమావేశంలో మాట్లాడుతున్న డీసీహెచ్‌ఎ్‌స డాక్టర్‌ చంద్రశేఖర్‌

డీసీహెచ్‌ఎ్‌స డాక్టర్‌ చంద్రశేఖర్‌ 

బి.కొత్తకోట, సెప్టెంబరు 27 : ఏపీ వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఆసుపత్రులలో కొరత ఉన్న వైద్యులు, స్టాఫ్‌ నర్సుల నియామకాన్ని అక్టోబరు 15వ తేదీలోగా పూర్తి చేస్తామని డిస్ట్రిక్ట్‌ కో-ఆర్డినేటర్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీసీహెచ్‌ఎ్‌స) డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. మంగళవారం ఆయన బి.కొత్తకోటలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఓపీ తదితర అంశాల గురించి వైద్యులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ బి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రిలో త్వరలో సర్జరీలు కూడా జరుగుతాయని అలాగే జనరల్‌ ఆపరేషన్లు కూడా జరిగేలా కృషి చేస్తామని అన్నారు. జిల్లాలో తమ పరిధిలో ఒక జిల్లా ఆసుపత్రితో పాటు 3 ఏరియా ఆసుపత్రులు, 2 యాభై పడకల ఆసుపత్రులు, 30 పడకల ఆసుపత్రులు 5 ఉన్నాయని వీటిలో కొరతగా ఉన్న వైద్యులు, స్టాఫ్‌ నర్సుల పోస్టులను అక్టోబరు 15వ తేదీలోగా భర్తీ చేస్తామని తెలిపారు. బి.కొత్తకోట సామాజిక ఆరోగ్య కేంద్రానికి బ్లడ్‌ బ్యాంకు మంజూరైందని పరికరాలు కూడా వచ్చాయని త్వరలోనే రక్తనిధి కేంద్రం ప్రారంభిస్తామన్నారు. నాడు-నేడు పథకం ద్వారా జిల్లాలోని 8 ప్రభుత్వ ఆసుపత్రులలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం సీజనల్‌గా వచ్చే జ్వరాలతో ఆసుపత్రులకు రోగులు అధికంగా వస్తున్నారన్నారు. వారికి తగిన వైద్యం అందించేలా అందరికీ ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో సీహెచ్‌సీ వైద్యాధికారి హసీనా పర్వీన్‌, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Read more