విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

ABN , First Publish Date - 2022-11-23T00:18:33+05:30 IST

విద్యార్థులు చిన్నతనం నుంచే విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని స్థానిక జడ్పీహైస్కూల్‌ హెచఎం రెడ్డెన్నశెట్టి పేర్కొన్నారు.

 విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
క్రీడాకారులతో ఉపాధ్యాయులు

మదనపల్లె క్రైం, నవంబరు 22: విద్యార్థులు చిన్నతనం నుంచే విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని స్థానిక జడ్పీహైస్కూల్‌ హెచఎం రెడ్డెన్నశెట్టి పేర్కొన్నారు. మంగళవారం స్కూల్‌ మైదానంలో స్కూల్‌ గేమ్స్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించా రు. మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లె, రామసముద్రం, మదనపల్లె మండలాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భం గా హెచఎం మాట్లాడుతూ మండల స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నియోజకవర్గ స్థాయి పోటీలను నిర్వహించి నట్లు తెలిపారు. ముఖ్యంగా క్రికెట్‌, కబడ్డీ, వాలీబాల్‌, బాస్కెట్‌ బాల్‌, ఖోఖో, టెన్నీకాయిట్‌, త్రోబాల్‌, రన్నింగ్‌, తదితర క్రీడలను నిర్వహించా మన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. జాతీయ క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలంటూ హెచఎం పిలుపునిచ్చా రు. కాగా క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన అభినం దించారు. కార్యక్ర మంలో ఆయా పాఠశాలల పీడీలు, పీఈటీలు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T00:18:33+05:30 IST

Read more