అభివృద్ధి ఏదీ..?

ABN , First Publish Date - 2022-12-09T23:48:55+05:30 IST

ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది రాయచోటి మున్సిపాల్టీ. జిల్లా కేంద్రంగా ఏర్పడి 9 నెలలు అవుతున్నా అభివృద్ధి ఏమాత్రం కానరావడం లేదు. ఆదాయం పెరుగుతున్నా.. అభివృద్ధిని ఎందుకనో మరిచారు.

అభివృద్ధి ఏదీ..?
గ్రాస్‌ల్యాండ్‌ స్థలంలో నిలిపిన ప్రైవేటు వాహనాలు

అధ్వానంగా రాయచోటి మున్సిపాల్టీ

సీఎం హామీలిచ్చి మూడేళ్లు

ప్రకటనలకే పరిమితమా..!

ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది రాయచోటి మున్సిపాల్టీ. జిల్లా కేంద్రంగా ఏర్పడి 9 నెలలు అవుతున్నా అభివృద్ధి ఏమాత్రం కానరావడం లేదు. ఆదాయం పెరుగుతున్నా.. అభివృద్ధిని ఎందుకనో మరిచారు. మూడేళ్ల కిందట సీఎం జగన్‌ రాయచోటి బహిరంగ సభలో పట్టణ అభివృద్ధిపై హామీల వర్షం కురిపించాడు. దాదాపు రూ.347 కోట్లతో పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కానీ హామీలిచ్చి మూడేళ్లయినా పట్టణం అభివృద్ధి చెందకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. కనీసం పార్కుల సుందరీకరణ కూడా చేయడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు.

రాయచోటి(కలెక్టరేట్‌), డిసెంబరు 9: రాయచోటి పట్టణాన్ని జిల్లా కేంద్రం చేశారే కానీ కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులే బహిరంగం గా చెబుతున్నారు. 2005 నుంచి రాయచోటి మున్సిపాలి టీగా రూపాంతరం చెంది కాస్తో, కూస్తో అభివృద్ధి ప్రజ లకు కనపడుతూ ఉండేది. జిల్లా కేంద్రమైన తర్వాత కనుచూపు మేర అభివృద్ధికి నోచుకోక... ఆచరణ సాధ్యం కాక ప్రకటనలకే పరిమితం కావాల్సి వస్తోందని ఆరోప ణలు బలంగా ఉన్నాయి. మున్సిపల్‌ సమావేశం జరిగిన ప్రతిసారి పట్టణంలో పార్కు నిర్మిస్తున్నాం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం, రాయచోటిని సుందరీకరణగా తీర్చి దిద్దుతాం అని ప్రగల్బాలు పలకడం తప్ప పట్టణంలో ఎక్కడా ఆచరణలో చూపడం లేదని ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. 2019 డిసెంబరు 24న సీఎం జగన్‌ రాయచోటి బహిరంగ సభలో పట్టణ అభివృద్ధిపై హామీల వర్షం కురిపించాడు. దాదాపు రూ.347 కోట్లతో పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించడం తో పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేశారు. కానీ ఆచర ణలో చూపకపోవడంతో ఇక అభివృద్ధి కలేనా అంటూ మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే 2014లో ఎస్‌ఎన్‌ కాలనీలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 90 సెంట్లు భూమి ఆక్రమణలో ఉంటే అప్పటి మున్సిపల్‌ కమిషనర్‌ చొరవ తీసుకొని చుట్టూ కంచె వేసి కాపాడా రు. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చినా ఆయన తలొగ్గకుండా గ్రాస్‌ ల్యాండ్‌ స్థలంలో ఉన్న షాపులను ఖాళీ చేయించి ఆ స్థలాన్ని మున్సిపల్‌ ఆధీనంలోకి తీసు కొచ్చారు. కానీ ప్రస్తుతం ఆ గ్రాస్‌ల్యాండ్‌లో ప్రైవేటు వారు వాహనాలను పార్కింగ్‌ చేసుకుంటున్నారు. దాదా పు 7 ఏళ్లుగా కోట్లు విలువ చేసే ఈ స్థలాన్ని ప్రజా అవసరాలకు ఉపయోగపడేలా మున్సిపాలిటీ అధికారు లు తగు చర్యలు తీసుకోలేదని విమర్శలు బలంగానే ఉన్నాయి. మున్సిపల్‌ ఆదాయం పెరిగింది కానీ అభివృ ద్ధి లేదని చెబుతున్నారు. పట్టణంలో ఉన్న ప్రభుత్వ భూములు బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోకుండా ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకుంటే పట్టణాన్ని సుందరీకరణంగా చేయవచ్చని ప్రజల వాదన. జాతీయ రహదారిలో ఠాణా దగ్గర రోడ్డు విస్తరణ పనులు ఆగిపోవడంతో ప్రజలు ట్రాఫిక్‌తో నిత్యం అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారి వైపు ఉన్న స్త్రీట్‌ లైట్లు కూడా అంతంత మాత్రమే వెలుగుతున్నాయి. ఇప్పటికైనా అభివృద్ధి వైపు అడుగులు వేయాలని పలువురు కోరుతున్నారు.

పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం..

పట్టణంలో ఉన్న గ్రాస్‌ల్యాండ్‌, డైట్‌ కళాశాల వెనుక ఉన్న గ్రౌండ్‌ను త్వరలో శుభ్రం చేసి పార్కుల ఏర్పాటుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. రెండు, మూడు రోజుల్లో పనులు మొదలుపెడతాం.

- రాంబాబు, మున్సిపల్‌ కమిషనర్‌

Updated Date - 2022-12-09T23:48:56+05:30 IST