-
-
Home » Andhra Pradesh » Kadapa » Ankalamma tirunala angarangavaibhavanga-MRGS-AndhraPradesh
-
అంగరంగవైభవంగా అంకాళమ్మ తిరుణాల
ABN , First Publish Date - 2022-04-25T04:55:34+05:30 IST
అంకాళమ్మగూడూరులో వెలసిన అంకాళమ్మ దేవత తిరుణాల ఆదివారం అంగరంగవైభవంగా జరిగింది.

సింహాద్రిపురం, ఏప్రిల్ 24: అంకాళమ్మగూడూరులో వెలసిన అంకాళమ్మ దేవత తిరుణాల ఆదివారం అంగరంగవైభవంగా జరిగింది. ఆదివారం ఉదయాన్నే అంకాళమ్మ దేవతకు అలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పూలమాలలతో అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చూడ ముచ్చటగా చేశారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు తీర్చుకుని, అమ్మవారిని తనివితీరా దర్శించుకున్నారు. తిరుణాల సందర్భంగా ఏర్పాటు చేసిన అంగళ్ల వద్ద జనాలు రద్దీగా కనిపించారు. వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు. వేసవి తాకిడికి భక్తులు ఇబ్బంది పడకుండా చల్లని నీరు, మజ్జిగ ఏర్పాటు చేశా రు.ఆలయం చుట్టూ, గ్రామం చుట్టూ సిరుబండిని తిప్పుతూ అమ్మవారికి మొక్కుబడులు తీ ర్చుకున్నారు. అలాగే ఒకేరోజు ప్రత్యేకంగా పట్టుచీరలతో అలంకరించిన రెండు కుం కుమ బం డ్లు బొజ్జాయపల్లి, కడపనాగాయపల్లి గ్రామాల నుంచి రావడం విశేషం. తిరుణాలకు వచ్చిన కుం కుమ బండ్లకు భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనస్వాగతం పలికారు. తిరుణాలలో భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ సభ్యులు, గ్రా మస్థులు అన్ని ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా సింహాద్రిపురం ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. అలా గే తిరుణాల సందర్భంగా బండలాగుడు పోటీలు నిర్వహించారు.