రైతు బజార్‌కు ఎస్టేట్‌ అధికారిని నియమించాలి

ABN , First Publish Date - 2022-05-24T05:43:35+05:30 IST

రైతు బజార్‌కు ఎ స్టేట్‌ అధికారిని నియ మించాలని, అక్కడ దళారుల వ్యవస్థను అరికట్టాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంతవర్మకు సోమవారం వినతిపత్రం అందజేశారు.

రైతు బజార్‌కు ఎస్టేట్‌ అధికారిని నియమించాలి

కడప(సెవెనరోడ్స్‌), మే 23: రైతు బజార్‌కు ఎ స్టేట్‌ అధికారిని నియ మించాలని, అక్కడ దళారుల వ్యవస్థను అరికట్టాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంతవర్మకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప రైతు బజారులో ఎస్టేట్‌ అధికారి లేకపోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా అధిక ధరలకు అమ్ముతున్నారన్నారు. దళాలరుల వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. నోటీ్‌సబోర్డులో ఉన్న ధరలకంటే అధిక ధరలకు అ మ్ముతున్నారన్నారు. రైతు బజార్‌లో ఇద్దరు మాత్రమే సిబ్బంది ఉన్నారని కనీసం ఐదుగురు ఉండాలని ఆయన తెలిపారు. అలాగే అక్కడ వర్షం వస్తే డ్రైనేజీ నీరంతా రోజుల తరబడి నిల్వ ఉంటోందన్నారు. దొంగతనాలు కూడా జరుగుతున్నాయని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. 

Read more