-
-
Home » Andhra Pradesh » Kadapa » An electrical short circuit is a major fire hazard-MRGS-AndhraPradesh
-
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ భారీ అగ్ని ప్రమాదం
ABN , First Publish Date - 2022-09-12T05:10:07+05:30 IST
కడప నగరం సెవెన్‌రోడ్స్ సమీపంలోని వైట్ హౌస్ కాంప్లెక్స్ నాలుగో అంతస్థులో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం
కడప(క్రైం), సెప్టెంబరు 11 : కడప నగరం సెవెన్‌రోడ్స్ సమీపంలోని వైట్ హౌస్ కాంప్లెక్స్ నాలుగో అంతస్థులో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జిల్లా అగ్నిమాపక సహాయ అధికారి తెలిపిన వివరాల మేరకు... సెవెన్‌రోడ్స్ సమీపంలోని వీరస్వామి మండీ వీధిలో ఉన్న వైట్ హౌస్ ఇన్ భవనం రెండవ ఫ్లోర్‌లో బ్యాంక్, 3వ ఫ్లోర్‌లో లాడ్జి, నాలుగో ఫ్లోర్‌లో ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం నాలుగో అంతస్తులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలంటుకో వడంతో, భవన యజమాని ఎస్‌కే మహబూబ్ హుస్సేన్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో వారు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈప్రమాదంలో కల్యాణ మండపానికి చెందిన చైర్లు, వంట సామగ్రితో పాటు ఏసీ ఔట్‌డోర్ యూనిట్లు పూర్తిగా కాలిపోయాయి. దాదాపు రూ.50 లక్షల మేర ఆస్తి న ష్టం జరిగిందని భవన యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.