రైతులందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి

ABN , First Publish Date - 2022-10-12T04:37:24+05:30 IST

అన్నమయ్య జిల్లాలోని రైతులందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ ఒక ప్రకటనలో తెలి పారు.

రైతులందరూ తప్పనిసరిగా  ఈకేవైసీ చేయించుకోవాలి

రాయచోటి(కలెక్టరేట్‌), అక్టోబరు11: అన్నమయ్య జిల్లాలోని రైతులందరూ తప్పనిసరిగా  ఈకేవైసీ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ ఒక ప్రకటనలో తెలి పారు. అన్నమయ్య జిల్లాలో ఇప్పటి వరకు 2,68,136 ఎకరాల్లో పంట సాగు చేయగా 99.9 శాతం ఈకేవైసీ పూర్తి చేసినట్లు తెలిపారు. పంటల బీమా, కొనుగోలు, పథకాలు పొందాలంటే కచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. కావున రైతులందరూ ఈ విషయన్ని గమనించి మీకు అందుబాటులో ఉన్న సచివాలయాలకు వెళ్లి ఈ నెల 14లోగా కచ్చితంగా బయోమెట్రిక్‌ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 


Read more