బోధనకు ఆటంకంగా మారిన యాపులన్నింటినీ రద్దు చేయాలి: యూటీఎఫ్‌

ABN , First Publish Date - 2022-08-17T04:40:30+05:30 IST

ప్రశాంత వాతావరణంలో బోధన చేయాల్సిన ఉపాధ్యాయులకు బోధన సమయాన్ని యాప్‌ల పేరుతో హరించేస్తున్నారని, అధికారులకు తగద ని, బోధనకు ఆటంకంగా మారుతున్న రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా డిమాండ్‌ చేశారు.

బోధనకు ఆటంకంగా మారిన యాపులన్నింటినీ రద్దు చేయాలి: యూటీఎఫ్‌

కడప(ఎడ్యుకేషన), ఆగస్టు 16: ప్రశాంత వాతావరణంలో బోధన చేయాల్సిన ఉపాధ్యాయులకు బోధన సమయాన్ని యాప్‌ల పేరుతో హరించేస్తున్నారని, అధికారులకు తగద ని, బోధనకు ఆటంకంగా మారుతున్న రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా డిమాండ్‌ చేశారు. లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కడప నగరం యూటీఎఫ్‌ భవన్లో మంగళవారం జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు ఏకపక్ష నిర్ణయాలతో యాప్‌ల బారాన్ని తగ్గించాల్సింది పో యి రోజుకు ఒక కొత్త యాప్‌ను జత చేస్తూ విద్యార్థుల బోధన సమయాన్ని హరించే విధంగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పర్యవేక్షణాధికారులను నియమించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా ఉపాధ్యాయుల సొంత మొ బైల్‌ ఫోన్లను ఉపయోగించి యాప్ల ద్వారా పర్యవేక్షిస్తాం అన డం నేల విడిచి సాము చేయడమేనని అన్నారు. ప్రభుత్వమే ఒక ఉద్యోగిని నియమించి ఎన్ని రకాల యాప్‌లను పెట్టుకున్న మాకు అభ్యంతరం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారుల వెంటనే బోధనకు ఆటంకంగా మారిన యాపులన్నింటిని రద్దు చే యాలని లేని పక్షంలో ఉపాధ్యాయుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాళెం మహే్‌షబాబు, నగర కార్యదర్శి కరిముల్లా తదితరులు పాల్గొన్నారు. 

Read more