ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించండి

ABN , First Publish Date - 2022-10-05T05:50:38+05:30 IST

ప్రజా సమ స్యల ను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆర్డీవో మురళి పేర్కొన్నారు.

ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించండి
గురుకుల పాఠశాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో

కురబలకోట, అక్టోబరు 4: ప్రజా సమ స్యల ను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆర్డీవో మురళి పేర్కొన్నారు. మంగళవారం మండ లంలోని కురబలకోట పంచాయతీ బైసానివా రిపల్లె సమీపంలో మహాత్మజ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాల నిర్మాణానికి  స్థలాన్ని ప రిశీలించి అనంతరం తహశీల్దార్‌ కార్యాలయం లో ప్రజాప్రతినిధులు, అధికారులతో  ఆయన మాట్లాడారు. కాగా కనసానివారిపల్లెకు చెందిన రైతు తనకు రక్త సం బంధీకుల నుంచి వచ్చిన భూమి సమస్యను అధికారులు పరిష్కరించడం లేదని ఆరోపిస్తూ, ఆత్మహత్య చేసుకుంటానని కార్యాలయం ఎదుట నిరసన తెలిపాడు. దీంతో ఆర్డీవో అతడిని పిలిపించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించాడు. కార్యక్రమంలో ఎంపీపీ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.


Read more