-
-
Home » Andhra Pradesh » Kadapa » Actions will be taken against provocative broadcasts-MRGS-AndhraPradesh
-
రెచ్చగొట్టే ప్రసారాలపై చర్యలు తప్పవు
ABN , First Publish Date - 2022-09-26T04:18:00+05:30 IST
యూట్యూబ్, సోషియల్ మీడియాలో ప్రసారమవుతున్న కొన్ని వీడియోలతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, ఇకపై యూట్యూబర్లు శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా, రెచ్చగొట్టే వీడియోలను ప్రసారం చేస్తే, కఠి న చర్యలు తీసుకోక తప్పదని ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేర్ణకుమార్ హెచ్చరించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదు
వీడియో ప్రసారాల్లో నియంత్రణ పాటించాలి
యూట్యూబర్లకు ఏఎస్పీ ప్రేర్ణకుమార్ హెచ్చరికలు
ప్రొద్దుటూరు క్రైం, సెప్టెంబరు 25: యూట్యూబ్, సోషియల్ మీడియాలో ప్రసారమవుతున్న కొన్ని వీడియోలతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, ఇకపై యూట్యూబర్లు శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా, రెచ్చగొట్టే వీడియోలను ప్రసారం చేస్తే, కఠి న చర్యలు తీసుకోక తప్పదని ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేర్ణకుమార్ హెచ్చరించారు. వీడియోల ప్రసారంలో స్వీయ నియంత్రణ పాట ించాలన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక వన్‌టౌన్ పోలీ్‌సస్టేషన్‌లో ప్రింట్, ఎలకా్ట్రనిక్ మీడియా, యూట్యూబర్లతో పోలీసు అధికారులు నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ మాట్లాడుతూ ఇటీవల యూట్యూబ్ ఛానళ్లలో రాజకీయ పార్టీల మధ్య గొడవలు ప్రేరేపించేలా వీడియోలు ప్రసారం అవుతున్నాయన్నారు. ఈ క్ర మంలో రాజకీయ పార్టీల నేతలు నిర్వహించే విలేఖరుల సమావేశంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉందన్నారు. వారి మాటల వల్ల గొడవలు, సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని భావించిన క్రమంలో ఆ పదాలను ఎడిట్ చేయాలన్నారు. మతా లు, కులాల నడుమ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు సృష్టిస్తే, వాటిని యూట్యుబ్‌ల్లో, సోషియల్ మీడియాలో పోస్ట్ చేయకూడదన్నారు. దీనికి గ్రూపు ఆడ్మిన్ పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించే వీడియోలు ప్రసారం చేసినా, అనధికార యూట్యూబ్, ఇతర సోషియల్ మీడియాపై కఠినంగా వ్యవహరిస్తామని, కేసులు నమోదు చేస్తామన్నారు. వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, ట్రాఫిక్ సీఐలు రాజారెడ్డి, ఇబ్రహీం, నారాయణయాదవ్, యుగంధర్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.