అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-11-07T23:47:14+05:30 IST

మండల పరిధిలోని ఇడమడక గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమ లేఅవుట్లు వేస్తున్నారని గ్రామ సర్పంచ్‌ చింతలపూరి నరసమ్మ సోమవారం గ్రామ కార్యదర్శి, అన్నమయ్య అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథార్టీ చైర్మన్‌ శ్రీఫణిచంద్‌కు వినతి పత్రం అందించారు.

అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలి

సర్పంచ్‌ చింతలపూరి నరసమ్మ

దువ్వూరు, నవంబరు 7: మండల పరిధిలోని ఇడమడక గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమ లేఅవుట్లు వేస్తున్నారని గ్రామ సర్పంచ్‌ చింతలపూరి నరసమ్మ సోమవారం గ్రామ కార్యదర్శి, అన్నమయ్య అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథార్టీ చైర్మన్‌ శ్రీఫణిచంద్‌కు వినతి పత్రం అందించారు. కడప-కర్నూలు జాతీయ రహదారి సమీపంలో ఉండడంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సుమారు 20 ఎకరాల్లో గ్రామ పంచాయతీ ప్రభుత్వం నుంచికానీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమ వెంచర్లు వేస్తున్నారన్నారు. పలుమార్లు సర్పంచ్‌గా కలెక్టర్‌ కార్యాలయంలో స్పందన కార్యక్రమాల్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్థులకు కొంతమంది అధికారులు సహకరిస్తూ గ్రామ పంచాయతీకి ఆదాయం రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు స్పందించి అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2022-11-07T23:47:36+05:30 IST

Read more