హత్య కేసులో నిందితుడు అరెస్టు

ABN , First Publish Date - 2022-09-11T05:07:51+05:30 IST

టంగుటూరులో బుధ వారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడు జంగ మయ్యను అదుపులోకి తీసుకున్నట్లు అదనపు ఎస్పీ ప్రేర్ణకుమార్‌ పేర్కొన్నారు.

హత్య కేసులో నిందితుడు అరెస్టు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏఎస్పీ

ప్రొద్దుటూరు, సెప్టెంబరు 10: టంగుటూరులో బుధ వారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడు జంగ మయ్యను అదుపులోకి తీసుకున్నట్లు అదనపు ఎస్పీ ప్రేర్ణకుమార్‌ పేర్కొన్నారు. స్థానిక డివిజనల్‌ పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆమె మాట్లాడుతూ బాపనపల్లె ఆంజనేయులు మోటారు మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నా డు. ఆంజనేయులు మద్యానికి బానిసై రోజూ కుటుం బీకులను ఇబ్బంది పెడుతూ డబ్బు కోసం డిమాండ్‌ చేసేవాడు. ఇదే క్రమంలో ఈ నెల 7న ఆంజనేయులు తన భార్య, తండ్రితోనూ ఆస్తి, డబ్బు కోసం గొడవ పడ్డాడు. మరుసటి రోజు ఉదయం ఈ గొడవలో తం డ్రి జంగమయ్య కల్పించుకుని ఆంజనేయులును రోక లి బండతో తలపై కొట్టి రక్తగాయాలు చేశాడు.

ఆంజ నేయులును చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు, కడపలోని ఆస్పత్రులకు తరలించగా మెరుగైన చికిత్స కోసం వైద్యులు బెంగుళూరుకు రెఫర్‌ చేశారు. బెంగుళూరు కు తరలిస్తుండగా 9వతేదీ ఉదయం ఆంజనేయులు మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మినరసమ్మ, ఇద్ద రు పిల్లలున్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదుపై రాజుపాళెం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు ను విచారించిన ప్రొద్దుటూరు రూరల్‌ సీఐ మధుసూ దన్‌గౌడ్‌ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కు మారుడు మద్యానికి బానిసై కుటుంబీకులను ఇబ్బం ది పెడుతుండడంతో భరించలేక కొట్టానని, గాయాల నుంచి కోలుకోలేక మృతి చెందినట్లు నేరాన్ని అంగీకరి చినట్లు ఏఎస్పీ వివరించారు.


హత్య కేసులో ముగ్గురు అరెస్ట్‌ : డీఎస్పీ

రాయచోటిటౌన్‌, సెప్టెంబరు 10: ఇటీవల సుండుపల్లె మండలం జి. రెడ్డివారిపల్లెలోని చప్పిడివాండ్ల పల్లెలో జరి గిన హత్యకేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు రాయచోటి డీఎస్పీ శ్రీధర్‌ తెలిపారు. రాయచోటి రూరల్‌ సీఐ లింగప్ప, సుండుపల్లె ఎస్‌ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో నిందితుల అరెస్టుపై డీఎస్పీ అందించిన వివరాల్లో కెళితే... ఈ నెల 5వ తేదీన సుండుపల్లె మండలం చప్పిడివాండ్లపల్లెలో రాత్రి అదే గ్రామస్తుడు చప్పిడి మోహన్‌నాయుడును అదే గ్రామానికి చెందిన కత్తి నరేష్‌, కత్తి పెద్దరెడ్డెప్ప, మొలకల నాగయ్య కలిసి రోకల బండతో కొట్టి హత్య చేసినట్లు ఆయన తెలియజేశారు.

అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులు దర్యాప్తును ము మ్మరం చేశారు. శనివారం సుండుపల్లె మండలం గుండ్లపల్లె వద్ద నిందితులను అరె స్టు చేసి విచారించగా మోహన్‌నాయుడు రోజూ మద్యం తాగి గ్రామంలో అందరి మీదికి వెళ్లేవాడని, తిడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేసేవాడని తెలిపారు. అందులో భాగంగానే మేము కూడా అతని బాధితులమేన ని, అతని ఆగడాలు భరించలేక హత్య చేసినట్లు నేరం అంగీకరించడంతో నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన తెలియజేశారు.

Updated Date - 2022-09-11T05:07:51+05:30 IST