ఉక్కు కోసం జేఎ్‌సడబ్ల్యుతో ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాం: ఆర్సీపీ

ABN , First Publish Date - 2022-12-13T23:16:52+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలో నిర్మించ తలపెట్టిన ఉక్కు పరిశ్రమ కోసం జేఎ్‌సడబ్ల్యుతో కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని రాయలసీ మ కమ్యూనిస్టు పార్టీ స్వాగతిస్తోందని ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి పేర్కొన్నారు.

ఉక్కు కోసం జేఎ్‌సడబ్ల్యుతో ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాం: ఆర్సీపీ
మాట్లాడుతున్న రవిశంకర్‌రెడ్డి

కడప (సెవెన్‌రోడ్స్‌), డిసెంబరు 13 : రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలో నిర్మించ తలపెట్టిన ఉక్కు పరిశ్రమ కోసం జేఎ్‌సడబ్ల్యుతో కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని రాయలసీ మ కమ్యూనిస్టు పార్టీ స్వాగతిస్తోందని ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తమ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభు త్వం ఒప్పందాలతో సరిపెడితే సహించమన్నారు. గతంలో ఎస్‌ఆర్‌ కంపెనీతో, తరువాత లిబర్టీతో ఒప్పందం చేసుకున్నారన్నారు. ఇప్పుడు జేఎ్‌సడబ్ల్యుతో ఒప్పందం చేసుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఒప్పందాలతోనే పరిమితమవుతా, లేక పనులు ప్రారంభించేది ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. రూ.8500 కోట్లతో భారీ ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని, ప్రభుత్వం తన వాటాగా రూ.12వేల కోట్లు పెట్టుబడి పెట్టి ప్రైవేటు ఉమ్మడి పరిశ్రమగా దీన్ని తీర్చిదిద్దాలని డిమాండ్‌ చేశారు. ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తయ్యే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయన్నారు. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్‌.మగ్బుల్‌బాషా, కె.శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:16:52+05:30 IST

Read more