రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుల స్వీకరణ

ABN , First Publish Date - 2022-08-18T05:21:08+05:30 IST

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (2022 సంవత్సరం)కు సంబంధించి జిల్లా ప్రభుత్వ, జిల్ల పరిషత్‌, మండల పరిషత్‌, పురపాలక, ఎయిడెడ్‌, డైట్‌, ఐడీడీఏ, సంస్కృత, సోషియల్‌ వెల్ఫేర్‌ మరియు ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ దేవరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుల స్వీకరణ

కడప(ఎడ్యుకేషన్‌), ఆగస్టు 17: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (2022 సంవత్సరం)కు సంబంధించి జిల్లా ప్రభుత్వ, జిల్ల పరిషత్‌, మండల పరిషత్‌,  పురపాలక, ఎయిడెడ్‌, డైట్‌, ఐడీడీఏ, సంస్కృత, సోషియల్‌ వెల్ఫేర్‌ మరియు ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ దేవరాజు ఒక ప్రకటనలో తెలిపారు. 15 సంత్సరాల సర్వీసు పూర్తి చేసి ఏవిధమైన క్రమశిక్షణా చర్యలు, క్రిమినల్‌ కేసులు లేని ఉపాధ్యాయులు మాత్ర మే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేసుకొన్న వారు దీనికి అర్హులు కారని తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 20 తేదీ నుంచి 24 తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఉపాధ్యాయులు దరఖాస్తులను సంబంధిత ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు ద్వారా ధ్రువీకరణ చేయించి డీఈవో కార్యాలయంలో సమర్పించాలని కోరారు. దరఖాస్తు నమూనాను ఉప విద్యాశాఖాధికారి, మండ ల విద్యాశాఖాధికారుల కార్యాలయం నుంచి జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కడపడీఈవో.ఇన్‌ నుండి పొందవచ్చని తెలిపారు. 

Read more