-
-
Home » Andhra Pradesh » Kadapa » Accelerate development works-MRGS-AndhraPradesh
-
అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
ABN , First Publish Date - 2022-10-08T04:43:30+05:30 IST
మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు సచివాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలందించేలా చర్యలు చేపట్టాలని మండల ప్రత్యేక అధికారి నాగరాజు, తహసీల్దారు జీవన్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.

గోపవరం, అక్టోబరు 7 : మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు సచివాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలందించేలా చర్యలు చేపట్టాలని మండల ప్రత్యేక అధికారి నాగరాజు, తహసీల్దారు జీవన్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం మండల కార్యాలయ సభాభవనంలో మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకందించే విషయంలో సచివాలయాల సిబ్బంది అశ్రద్ధ పనికిరాదన్నారు. ఈవోపీఆర్‌డీ హసీనా, అన్ని శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.