జిల్లా కేంద్రంలో ఆప్కో భవనం నిర్మించాలి

ABN , First Publish Date - 2022-07-19T04:35:45+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద రంగం చేనేత రంగం అని చేనేత ఐక్యవేదిక నాయకుడు మోడెం నాగరాజు అన్నారు.

జిల్లా కేంద్రంలో ఆప్కో భవనం నిర్మించాలి
నిరసన తెలియజేస్తున్న జాతీయ చేనేత ఐక్యవేదిక నాయకులు

రాయచోటి(కలెక్టరేట్‌), జూలై 18: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద రంగం చేనేత రంగం అని చేనేత ఐక్యవేదిక నాయకుడు మోడెం నాగరాజు అన్నారు. రైతు భరోసా సాకుతో చేనేత కార్మికుల పింఛన్లు తొలగించడం చాలా దారు ణమన్నారు. కేవలం 40 కుంటలు భూమి ఉన్న చేనేతలను రైతు భరోసా పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం అమలుతో పాటు, అచ్చులు, వార్పులు అద్దకం చేసే వారికి  కూడా ఈ పథకం వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  ప్రతి చేనేత కుటుంబానికి రెండు లక్షలు ముద్ర రుణ సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌కు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో ఎం. నాగరాజ, కే. రాము, రెడ్డెయ్య, ఎంకే మల్లికార్జున, ఆంజనేయులు పాల్గొన్నారు. 


Read more