రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ABN , First Publish Date - 2022-09-12T05:25:40+05:30 IST

రామసముద్రం మండలంలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్ని ప్రమాదంలో సైద్‌వలీ (27) అనే యువకుడు మృతిచెందాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మృతి చెందిన జింక

రామసముద్రం, సెప్టెంబరు 11: రామసముద్రం మండలంలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్ని ప్రమాదంలో సైద్‌వలీ (27) అనే యువకుడు  మృతిచెందాడు. మండలంలోని దిగువపేటకు చెందిన సైద్‌వలీ ద్విచక్రవాహనంలో ఆదివారం సొంతపనుల నిమిత్తం ముళబాగల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా కురిజల గ్రా మం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వాహన డ్రైవరుగా పనిచేస్తూ సైద్‌వలీ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తండ్రి సైద్‌ అక్మల్‌ ఫిర్యాదు మేరకు ఎస్సై రవీంద్రబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.

 వాహనం ఢీకొని జింక మృతి


ములకలచెరువు, సెప్టెంబరు 11: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ జింక ఆదివారం మృతి చెందింది.  మండ లంలోని బురకాయలకోట సమీపంలో ఉన్న ముత్యాలమ్మ ఆలయం వద్ద రోడ్డు దాటుతున్న జింకను గుర్తుతెలి యని వాహనం ఢీకొంది. ఈ ప్రమా దంలో తీవ్రంగా గాయపడ్డ జింక అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్‌ అధికారి రెడ్డి వరప్రసాద్‌ సంఘటనా స్ధలాన్ని పరిశీలించి జింక కళేబరాన్ని సండ్రడివిలో ఖననం చేశారు. 

Read more