టాక్టర్‌ ఢీకొని యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-08-10T05:49:40+05:30 IST

మండలంలోని నల్లపురెడ్డిపల్లె-బెస్తపల్లె మార్గమధ్యలో మంగళవారం

టాక్టర్‌ ఢీకొని యువకుడి మృతి

పెనగలూరు, ఆగస్టు 9: మండలంలోని నల్లపురెడ్డిపల్లె-బెస్తపల్లె మార్గమధ్యలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తూర్పుపల్లెకు చెందిన నల్లబోయిన అమరనాఽథ్‌ (19) అక్క డి కక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలిలా.. తన అన్న కుమా రుడి పుట్టిన రోజు సందర్భంగా కేకు కోసం మంగళవారం సాయంత్రం బైకుపై రాజంపేటకు బయలుదేరాడు. నల్లపురెడ్డి పల్లె దాటుకుని బెస్తపల్లె సమీ పంలోకి రాగానే ట్రాక్టర్‌, బైకు ఢీకొన్నా యి. ఈప్రమాదంలో అమర్‌నాథ్‌ అక్క డికక్క డే మృతి చెందాడు. ఇతను ఇటీవలే ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాశాడు. పోలీ సులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

 

Read more