అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-12-30T23:56:04+05:30 IST

మండలంలోని రాగిమాకుల పల్లె పంచాయతీకి చెందిన పేడరాజుపల్లెలోని విశ్వనాథ్‌ శ్రీదేవిల కుమారుడు లోకేష్‌(21)శుక్రవారం రాత్రి బెంగళూరు లోని తను నివాసం ఉంటున్న గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

రామసముద్రం, డిసెంబరు 30: మండలంలోని రాగిమాకుల పల్లె పంచాయతీకి చెందిన పేడరాజుపల్లెలోని విశ్వనాథ్‌ శ్రీదేవిల కుమారుడు లోకేష్‌(21)శుక్రవారం రాత్రి బెంగళూరు లోని తను నివాసం ఉంటున్న గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబసభ్యుల వివరాల మేరకు లోకేష్‌ డిగ్రీ పూర్తి చేసి రెండు నెలలుగా బెంగళూరులోని బీటీఎం లే అవు ట్‌లో తన నలుగురు మిత్రులతో కలిసి ఉంటూ ఉద్యోగ అన్వేష ణలో ఉండేవాడన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి లోకేష్‌ తండ్రి విశ్వనాథ్‌ ఫోన చేయగా పలకకపోవడంతో మిత్రులకు ఫోన చేసి వాకబు చేశామన్నారు. అయితే కొంత సేపటి తరు వాత అతని మిత్రులు ఫోన చేసి లోకేష్‌ తన గదిలో ఉరివేసుకొ ని చనిపోయాడని విశ్వనాథ్‌కు సమాచారం తెలియజేశారు. లోకేష్‌ మరణవార్తతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కుమారుడి మృతిపై తండ్రి విశ్వనాథ్‌ అనుమా నం వక్తం చేస్తున్నారు. కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి మృతుని శవ పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదే హాన్ని అందించారు. మృతికి గల కారణాలు తెలియాల్సిఉంది.

యువకుడి ఆత్మహత్య

మదనపల్లె క్రైం, డిసెంబరు 30: మండలంలోని తట్టివారిపల్లెకు చెందిన హరీష్‌(24)అనే యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐటీఐ చేసి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనేపథ్యంలో కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఇతడు గురువారం రాత్రి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నిం చాడు. గమనించిన కుటుంబీకులు బాధితుని జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతికి తరలిస్తుండగా, దారిలో మృతిచెందాడు. అనంతరం కుటుంబ సభ్యులు యువకుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిపోయారు.

Updated Date - 2022-12-30T23:56:04+05:30 IST

Read more