పెద్ద బోయపల్లెలో వైద్య శిబిరం

ABN , First Publish Date - 2022-09-19T05:30:00+05:30 IST

తం బళ్లపల్లె మండలం కొటాల పం చాయతీ పెద్ద బోయపల్లెలో సోమ వారం కోసువారిపల్లె పీహెచ్‌సీ వైద్యులు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

పెద్ద బోయపల్లెలో వైద్య శిబిరం
జ్వర బాధితులకు పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన జ్వర పీడితులకు వైద్య పరీక్షలు

తంబళ్లపల్లె, సెప్టెంబరు 19: తం బళ్లపల్లె మండలం కొటాల పం చాయతీ పెద్ద బోయపల్లెలో సోమ వారం కోసువారిపల్లె పీహెచ్‌సీ వైద్యులు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ‘పెద్ద బోయపల్లెను వణికి స్తున్న జ్వరాలు’ అనే శీర్షికన సోమ వారం ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో కథనం వెలువడింది. కథనానికి స్పం దించిన వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ, ఆర్‌డబ్ల్యూయస్‌ అధికారులు సోమవారం ఉదయమే పెద్ద బోయపల్లెకు చేరుకుని జ్వరాలపై ఆరా తీశారు. వైద్యాధికారి నిరంజన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి  జ్వరంతో బాధపడుతున్న 6 మందిని గుర్తించి వారి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. చిన్న వ్యాధులతో బాధప డుతున్న 27 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించారు. ఎంపీడీవో ఆనంద్‌ కుమార్‌, ఈవోపీఆర్డీ రాజశేఖర్‌ నాయక్‌ గ్రామంలో ముమ్మరంగా పర్యటించి మురుగు నీటి కాలువలు, తాగు నీటి ట్యాంకు లు, నీటి నిల్వల వద్ద బ్లీచింగ్‌ చల్లించి నీటి ట్యాంకును శుభ్రం చేయించి క్లోరినేషన్‌ చేయించారు. ఆర్‌డబ్ల్యూయస్‌ డీఈ శ్రీనివాసులు, ఏఈ అశో క్‌ బాబు గ్రామంలో ఉన్న తాగు నీటికి 8 రకాల కెమికల్‌ టెస్టింగ్స్‌ చేసి నీటిలో ఎటువంటి సూక్ష్మక్రిములు లేవని నిర్ధారించారు. కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈవో వెంకట్రమణ, ఎంఈవో త్యాగరాజు, పీఎంవోవో రెడ్డెప్ప రెడ్డి, ఎంఎల్‌హెచ్‌పీ జ్యోతి, హెల్త్‌ అసిస్టెంట్‌ కృష్ణా నాయక్‌, సచివాల య కార్యదర్శి సర్దార్‌, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు  పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-19T05:30:00+05:30 IST