ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ.. మహిళ మృతి

ABN , First Publish Date - 2022-09-14T04:37:40+05:30 IST

ద్విచ్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఓ మహిళ దుర్మరణం పాలైంది

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ.. మహిళ మృతి
ప్రమాదంలో మృతి చెందిన కాంతమ్మ

వాల్మీకిపురం, సెప్టెంబరు 13: ద్విచ్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఓ మహిళ దుర్మరణం పాలైంది  పోలీసుల కథనం మేరకు..కదిరి మండలం ఎరికిలవాండ్లపల్లెకు చెందిన ఆర్‌.మోహన్‌రావ్‌(61), అతని భార్య కాంతమ్మ(55)తో కలిసి సోమవారం రాత్రి ద్విచక్రవాహనంపై బీదవాండ్ల ్లపల్లెకు  వెళ్తుండగా వాల్మీకిపురం సమీ పంలోని పింగాణి ఫ్యాక్టరీ వద్ద  తిరుప తి వైపు వెళ్తున్న  లారీ వెనుక వైపు నుంచి ఢీకొంది. ఈ ప్రమాదం లో కాంతమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, మోహన్‌రావు గాయాలతో బయటపడ్డాడు. ఎస్‌ఐ బిందుమాధవి  సంఘటనా స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నా రు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Read more