హార్సిలీహిల్స్‌లో రూ.250 కోట్లతో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌

ABN , First Publish Date - 2022-09-28T04:06:42+05:30 IST

ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో రూ.250 కోట్లతో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మాణం త్వరలో చేపట్టనున్నట్లు జిల్లా పర్యాటక శాఖాధికారి నాగభూషణం తెలిపారు.

హార్సిలీహిల్స్‌లో రూ.250 కోట్లతో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌
గాలిబండపై నేచర్‌ వాక్‌ చేస్తున్న విద్యార్థులు

జిల్లా పర్యాటక శాఖాధికారి నాగభూషణం 

బి.కొత్తకోట, సెప్టెంబరు 27 : ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో రూ.250 కోట్లతో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మాణం త్వరలో చేపట్టనున్నట్లు జిల్లా పర్యాటక శాఖాధికారి నాగభూషణం తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో రాయచోటిలోని సాయి ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన 130 మంది విద్యార్థులతో కలిసి జిల్లా పర్యాటక శాఖాధికారి హార్సిలీహిల్స్‌లో నేచర్‌ వాక్‌ను ప్రారంభించారు. విద్యార్థులు హిల్స్‌లోని గాలిబండ, వ్యూపాయింట్‌, అడ్వంచర్‌ పార్కులో ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో నేచర్‌ వాక్‌ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పర్యాటక శాఖాధికారి మాట్లాడుతూ హార్సిలీహిల్స్‌ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని త్వరలోనే ఒబెరాయ్‌ సంస్థ అధ్వర్యంలో రూ.250 కోట్లతో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మాణం చేపడుతోందని తెలిపారు. ఇందుకోసం 24 ఎకరాల భూమిని కలెక్టర్‌ గిరీషా కేటాయించారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాయచోటి అసిస్టేంట్‌ డైరెక్టర్‌ సుధాకర్‌ రెడ్డి, టూరిజం మేనేజర్‌ సాల్వీన్‌రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-09-28T04:06:42+05:30 IST