గూడరేవుపల్లె వంకలో మృతదేహం!

ABN , First Publish Date - 2022-10-13T04:18:13+05:30 IST

పీలేరు మండలం గూడరేవుపల్లె వద్దనున్న వంకలో బుధ వారం మధ్యాహ్నం ఓ మృతదేహం కని పించింది.

గూడరేవుపల్లె వంకలో మృతదేహం!
నీటిలో తేలుతున్న మృతదేహం

 గల్లంతైన ఆటోడ్రైవర్‌దిగా అనుమానం 

పీలేరు, అక్టోబరు 12: పీలేరు మండలం గూడరేవుపల్లె వద్దనున్న వంకలో బుధ వారం మధ్యాహ్నం ఓ మృతదేహం కని పించింది. తల నుంచి పాదాల వరకు పూర్తిగా కుళ్లిపోయి కేవలం ఎముకలు మాత్రమే కనిపిస్తున్న స్థితిలో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  ఈ మృతదేహం గత నెల 20న గల్లంతైౖన ఆటోడ్రైవర్‌దిగా పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. పీలేరు మండలం తలపుల నుంచి పీలేరుకు వస్తున్న ఓ ఆటో సెప్టెంబరు 20 వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో గూడరేవుపల్లె వంకలో బోల్తాపడింది.  అగ్నిమాపక సిబ్బంది సాయంతో ఆటోను వాగులో నుంచి వెలికి తీసిన పోలీ సులు, ఆ రోజు రాత్రి, మరుసటి రోజు మధ్యాహ్నం వరకు గాలించినా డ్రైవర్‌ ఆచూకీ లభ్యం కాకపోవడంతో తమ ప్రయత్నాలు విరమించారు. ప్రమాదం నుంచి డ్రైవర్‌ బయటపడి ఉంటాడని,, నాలుగైదు రోజుల్లో తిరిగి వస్తాడని అందరూ భావించారు. రిజిసే్ట్రషన నెంబరు ఆధారంగా  పోలీసులు ఆటో యజమానికి దానిని అప్పగించేశారు. అయితే, బుధవారం వాగులో మృత దేహం తేలడంతో అది ఆటో డ్రైవర్‌దే అయి ఉంటుందని భావించిన విలేఖ రులు, గ్రామస్థులు పోలీసులను వాకబు చేయగా డ్రైవర్‌ వివరాలు చెప్పేందు కు నీళ్లు నమిలారు. రిజిసే్ట్రషన ఆధారంగా యజమానిని గుర్తించి అప్పగించిన పోలీసులు డ్రైవర్‌ ఎవరనే అంశాన్ని పూర్తిగా వాకబు చేయలేదని, అందుకే శవం ఎవరిదో పోలీసులు చెప్పలేకపోతున్నారనే అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి.  డ్రైవర్‌ వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఐ మోహన రెడ్డి తెలిపారు. 


Read more