డ్రాగా ముగిసిన క్రికెట్‌ మ్యాచ్‌

ABN , First Publish Date - 2022-09-11T05:03:03+05:30 IST

ఏసీఏ సౌత్‌ జోన్‌ సీనియర్‌ మల్టీ డే మ్యాచ్‌ల్లో భాగంగా కడప - క ర్నూలు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌, అనంతపురం - నెల్లూరు జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌ కూడా శనివారం డ్రాగా ముగిశాయి.

డ్రాగా ముగిసిన క్రికెట్‌ మ్యాచ్‌
సెంచురీ సాధించిన సంపత్‌కుమార్‌

కడప (స్పోర్ట్స్‌), సెప్టెంబరు 10:  ఏసీఏ సౌత్‌ జోన్‌ సీనియర్‌ మల్టీ డే మ్యాచ్‌ల్లో భాగంగా కడప  - క ర్నూలు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌, అనంతపురం - నెల్లూరు జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌ కూడా శనివారం డ్రాగా ముగిశాయి. వివరాలిలా.. 

వైఎ్‌సఆర్‌ఆర్‌ స్టేడియంలో కడప - కర్నూలు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత కడప జట్టు మొ దటి ఇన్నింగ్‌లో 87 ఓవర్లకు 259 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. కర్నూలు జట్టు మొదటి ఇన్నింగ్‌ లో 81.2 ఓవర్లలో 242 పరుగులతో ఆలౌట్‌ అయిం ది. కాగా కడప జట్టు రెండో ఇన్నింగ్‌ ప్రారంభించి 58.4 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్‌ కాబడింది. ఇందులో ఎస్‌.ధృవకుమార్‌రెడ్డి 50 పరుగులు చేశా రు. కర్నూలు జట్టు బౌలింగ్‌లో ఎం.ఆంజనేయులు ఐదు వికెట్లు సాధించారు. కర్నూలు జట్టు రెండో ఇన్నింగ్‌ ప్రారంభించి 4.2 ఓవర్లలో శనివారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 14 పరుగులు చేసింది. దీంతో కడప - కర్నూలు జట్ల మధ్య మ్యాచ్‌డ్రాగా ముగిసింది. కాగా మొదటి ఇన్నింగ్‌లో కడప జట్టు ఆధిక్యత సాధించింది.

 కేఓఆర్‌ఎం మైదానంలో అనంతపురం- నెల్లూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత అనంతపురం జట్టు మొదటి ఇన్నింగ్‌లో 67 ఓవర్లకు 295 పరుగులు సాఽధించింది. తదుపరి నెల్లూరు జట్టు బ్యాటింగ్‌ చేపట్టి తన మొదటి ఇన్నింగ్‌లో 61.3 ఓవర్లలో 257 పరుగులు సాధించింది. ఆట మూడో రోజు శనివారం అనంతపురం జట్టు రెండో ఇన్నింగ్‌ ప్రారంభించి 25 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు సాధించింది. ఇందులో సంపత్‌కుమార్‌ (బ్యాటర్‌) 58 బంతు ల్లో 101 పరుగులు సాధించాడు. ఇందులో 10 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. నిర్వాహకులు ఆట ను డ్రాగా ప్రకటించారు. అనంతపురం జట్టు మొదటి ఇన్నింగ్‌లో లీడింగ్‌ సాధించినట్లైంది.

Read more