వివాదాస్పదంగా మారిన భూ వివాదం

ABN , First Publish Date - 2022-11-07T23:43:56+05:30 IST

రామ్‌నగర్‌ వేణుగోపాలస్వామి దేవాలయం సమీపంలో రోడ్డుకు ఆనుకొని కొందరు నిర్మాణాలు చేస్తుండగా రెవెన్యూ, పోలీసు అధికారులు వెళ్లి అడ్డుకున్నారు.

వివాదాస్పదంగా మారిన భూ వివాదం

నిర్మాణాలను అడ్డుకున్న పోలీసులు, రెవెన్యూ

రాజంపేటటౌన్‌, నవంబరు 7: రామ్‌నగర్‌ వేణుగోపాలస్వామి దేవాలయం సమీపంలో రోడ్డుకు ఆనుకొని కొందరు నిర్మాణాలు చేస్తుండగా రెవెన్యూ, పోలీసు అధికారులు వెళ్లి అడ్డుకున్నారు. తాము బలహీన వర్గాలకు చెందిన వారమని, తమకు గతంలో పట్టాలు ఇచ్చారని పేర్కొంటూ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ అధికారుల నుంచి ఎటువంటి పత్రాలు లేకుండా ఎలా నిర్మాణాలు చేస్తారని తహశీల్దారు సుబ్రహ్మణ్యంరెడ్డి, ఎస్‌ఐ లక్ష్మీప్రసాద్‌రెడ్డి, మున్సిపల్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి కట్టడాలను నిలిపివేశారు. దీనికి సంబంధించి తమ వద్ద పత్రాలు ఉన్నాయని బలహీన వర్గాల ప్రజలు పేర్కొనగా ఏవైనా పత్రాలు ఉంటే వాటిని చూపించి తమ అనుమతులు పొందిన తరువాతే ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టాలని, లేదంటే చేయడానికి వీలు లేదని అడ్డుకున్నారు. ఈ విషయమై నిర్మాణదారులకు, అధికారులకు మద్య వాగ్వివాదం చెలరేగింది. ఎట్టకేలకు అధికారులు నిర్మాణాలను ఆపేశారు.

Updated Date - 2022-11-07T23:43:56+05:30 IST

Read more