8 మంది స్మగ్లర్ల అరెస్టు

ABN , First Publish Date - 2022-09-11T04:11:00+05:30 IST

కలికిరి సమీపంలోని గుట్టపాలెం వద్ద శనివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా పల్సర్‌బైక్‌తో పాటు ఇన్నోవా వాహనంలో పారిపోయేందుకు ప్రయత్నించిన 8 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు.

8 మంది స్మగ్లర్ల అరెస్టు
పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు

19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

వివరాలు వెల్లడించిన ఎస్పీ హర్షవర్ధన్‌రాజు


రాయచోటి టౌన్‌, సెప్టెంబరు 10: ఎర్రచందనం అక్రమ రవాణాపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కలికిరి సమీపంలోని గుట్టపాలెం వద్ద శనివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా పల్సర్‌బైక్‌తో పాటు ఇన్నోవా వాహనంలో పారిపోయేందుకు ప్రయత్నించిన 8 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 33 లక్షల విలువ గల 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్‌రాజు మీడియాకు వివరాలను వెల్లడించారు. రాయచోటి డీఎస్పీ శ్రీధర్‌, వాయల్పాడు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సురే్‌షల ఆధ్వర్యంలో శనివారం ఎర్రచందనం అక్రమ రవాణాపై వచ్చిన సమాచారం మేరకు కలికిరి ఏఎ్‌సఐ మధుసూదనాచారి సిబ్బందితో కలిసి కలికిరి-సోమల రోడ్డులోని కలికిరి మండలం గుట్టపాలెం బస్టాప్‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. కలికిరి వైపు నుంచి ఒక పల్సర్‌ మోటార్‌ సైకిల్‌తో పాటు ఒక ఇన్నోవా వాహనం అనుమానం కలిగించే విధంగా అతివేగంగా వస్తూ పోలీసులు ఆపే ప్రయత్నం చేయగా దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అరెస్టు అయిన వారిలో తమిళనాడు రాష్ర్టానికి చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు విజయ్‌కుమార్‌, రాజేంద్రన్‌రమే్‌ష, అప్పస్వామి కుమరవేల్‌, రాజీ రంగనాధన్‌, సేటు, ముత్తు రామరాజు, నటరాజ్‌ మంజునాధ, మురుగన్‌ సూర్య అనే 8 మంది స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.33 లక్షల విలువ చేసే 19 ఎర్రచందనం దుంగలు, 5 సెల్‌ఫోన్లు, రూ.700 నగదుతో పాటు ఒక ఇన్నోవా కారు, బైక్‌ను స్వాధీనం చేసుకుని కలికిరి పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకునేందుకు కృషి చేసిన వాయల్పాడు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బీఎన్‌ సురేష్‌, ఏఎ్‌సఐ మధుసూదనాచారితో పాటు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఎవరైనా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Read more