పుట్టా ఆధ్వర్యంలో 50 కుటుంబాలు టీడీపీలో చేరిక

ABN , First Publish Date - 2022-09-12T05:05:52+05:30 IST

మండలంలోని వెదురూరు గ్రామంలో వైసీపీకి చెందిన 50 కుటుంబాలవారు ఆదివారం టీడీపీలో చేరినట్లు మైదుకూరు టీడీపీ ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌ చెప్పారు.

పుట్టా ఆధ్వర్యంలో 50 కుటుంబాలు టీడీపీలో చేరిక
కండువాలు కప్పుతున్న సుధాకర్‌యాదవ్‌

చాపాడు, సెప్టెంబరు 11: మండలంలోని వెదురూరు గ్రామంలో వైసీపీకి చెందిన 50 కుటుంబాలవారు ఆదివారం టీడీపీలో చేరినట్లు మైదుకూరు టీడీపీ ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌ చెప్పారు. టీడీపీలో చేరిన వారిలో సిద్దవటం నాయబ్‌, మహమ్మద్‌, మౌలాలీ, బాష, మహబూబ్‌బాష, చింతకాయల నాయబ్‌, కమాల్‌బాష, మహిళలు రహమతిన్‌, కరీమున్‌, ఖాదర్‌బీ, ఇంకా 40 కుటుంబాలవారు పార్టీలో చేరినట్లు చెప్పారు. ముస్లింలు స్వచ్ఛందంగా టీడీపీలో చేరారన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు అన్నవరం సుధాకర్‌రెడ్డి, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి మునిశేఖర్‌రెడ్డి, టీడీపీ నాయకులు నరసింహారెడ్డి, సుబ్బిరెడ్డి, సుబ్బరామిరెడ్డి, సుబ్బరాయుడు, ఓబులేసు, ప్రభాకర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more