-
-
Home » Andhra Pradesh » Kadapa » 413 lakh monthly salary for YVU researcher-MRGS-AndhraPradesh
-
వైవీయూ పరిశోధకుడికి రూ.4.13 లక్షల నెలసరి వేతనం
ABN , First Publish Date - 2022-07-19T05:04:07+05:30 IST
వైవీయూనివర్శిటీ కెమిస్ట్రీ విభాగం నుంచి డాక్టరేట్ అందుకున్న డాక్టర్ పోగుల శ్రీకాంత్‌రెడ్డికి తాజాగా అమెరికాలోని సియాసెల్ చిల్డ్రన్స్ ఆస్పత్రి రీసెర్చ్ ఫౌండేషన్‌లో డాక్టరల్ పోస్టు ఫెలో (పీడీఎ్‌ఫ)కు ఎంపికయ్యారు.

అమెరికాలో పీడీఎ్‌ఫకు అవకాశం
కడప వైవీయూ, జూలై 18: వైవీయూనివర్శిటీ కెమిస్ట్రీ విభాగం నుంచి డాక్టరేట్ అందుకున్న డాక్టర్ పోగుల శ్రీకాంత్‌రెడ్డికి తాజాగా అమెరికాలోని సియాసెల్ చిల్డ్రన్స్ ఆస్పత్రి రీసెర్చ్ ఫౌండేషన్‌లో డాక్టరల్ పోస్టు ఫెలో (పీడీఎ్‌ఫ)కు ఎంపికయ్యారు. ఈయన మనదేశ కరెన్సీ ప్రకారం నెలకు రూ.4.13 లక్షల వేతనం తీసుకోనున్నారు. ఈ సందర్భంగా వైవీయూ వీసీ సూర్యకళావతి, రిజిస్ట్రార్ విజయరాఘవప్రసాద్‌లు శ్రీకాంత్‌రెడ్డిని అభినందించా రు. గ్రామీణ ప్రాంత వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన శ్రీకాంత్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ వైవీయూలోని కెమిస్ట్రీ విభాగంలో డాక్టర్ వసుగోవర్ధన్‌రెడ్డి పర్యవేక్షణలో పీహెచ్‌డీ పూర్తి చేశామన్నారు. అనంతరం శ్రీకాంత్‌రెడ్డిని ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, డాక్టర్ వసుగోవర్ధన్‌రెడ్డి, సీఈ ఈశ్వర్‌రెడ్డి, పాలక మండలి సభ్యుడు వెంకటసుబ్బయ్య, ఎన్‌ఎ్‌సఎస్ సమన్వయకర్త డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, అధ్యాపకులు, పరిశోధకులు అభినందించారు.