ట్రిపుల్‌ఐటీ సీట్లకు 39,155 దరఖాస్తులు

ABN , First Publish Date - 2022-09-18T05:10:35+05:30 IST

రాష్ట్రంలో ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో నడుస్తున్న నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో 4,400సీట్లకు గాను 39,155 దరఖాస్తులు వచ్చాయి.

ట్రిపుల్‌ఐటీ సీట్లకు 39,155 దరఖాస్తులు

వేంపల్లె, సెప్టెంబరు 17:రాష్ట్రంలో ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో నడుస్తున్న నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో 4,400సీట్లకు గాను 39,155 దరఖాస్తులు వచ్చాయి. ఆగస్టు 30వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఆర్జీయూకేటీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది. ఆన్‌లైన్‌లో శనివారం వరకు 39,155 దరఖాస్తులు నమోదయ్యాయయని సీట్ల భర్తీ కన్వీనర్‌ తెలిపారు. 19వ తేదీ సాయంత్రం 5గంటలకు గడువు ముగియనుంది. గత ఏడాది సుమారు 55వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది దరఖాస్తులు తగ్గాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడిచినప్పటికి నోటిఫికేషన్‌ జారీ చేయడంలో జాప్యం కావడంతో దరఖాస్తులు తగ్గాయని ట్రిపుల్‌ఐటీ వర్గాల సమాచారం.


Read more