30 పోలీస్‌ యాక్టును రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-10-02T05:30:00+05:30 IST

రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన భావ ప్రకటన హక్కులను కాలరాస్తున్న 30 పోలీస్‌ యాక్టును రద్దు చేయాలని అఖిల పక్ష నేతలు ముక్తకంఠంతో డిమాండు చేశారు.

30 పోలీస్‌ యాక్టును రద్దు చేయాలి
పోలీస్‌ 30 యాక్టు రద్దు కోరుతూ సత్యాగ్రహ దీక్ష చేస్తున్న అఖిలపక్ష నేతలు

 సత్యాగ్రహదీక్షలో అఖిలపక్ష నేతల డిమాండు

ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 2 : రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన భావ ప్రకటన హక్కులను కాలరాస్తున్న 30 పోలీస్‌ యాక్టును రద్దు చేయాలని అఖిల పక్ష నేతలు ముక్తకంఠంతో డిమాండు చేశారు. ఈ మేరకు గాంధీ జయంతి సందర్భంగా స్థానిక గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష నేతలు 30 పోలీస్‌ యాక్టు రద్దు డిమాండుతో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు బి.రామయ్య, పట్టణ కార్యదర్శి పి.సుబ్బరాయుడు, కాంగ్రెస్‌ పట్టణ ఇన్‌చార్జి పీఎండీ నజీర్‌, జనసేన నాయకులు శివకళ్యాణ్‌రెడ్డి, మూవ్‌మెంట్‌ ఫర్‌ జస్టీస్‌ రాష్ట్ర కార్యదర్శి సలీం తొలుత గాంధీ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించి, మాట్లాడారు. 30 పోలీసు యాక్టు, సెక్షన్‌ 151లు పోలీసు చేతుల్లో ఉన్నందున పౌరుల భావ ప్రకటన స్వేచ్చకు భంగం కలుగుతుందన్నారు. ఈ చట్టాలు కలెక్టర్‌ చేతుల్లో ఉండాలన్నారు. ప్రతి దానికి పోలీసులే అయితే ఇక ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఏసోబు, శ్రీను, జమాతే ఇస్లామీ హింద్‌ నాయకులు అహమతుల్లా, ఇన్సాఫ్‌ జిల్లా కార్యదర్శి షరీఫ్‌, ఏఐబీఈఏ పట్టణ కార్యదర్శి సుధాకర్‌, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు సుబ్బరాయుడు, ఆటో యూనియన్‌ హరి మహిళా సమాఖ్య నాయకురాళ్లు ప్రమీల, సుజాత, సీపీఐ నాయకులు శివారెడ్డి, చంద్రశేఖర్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-02T05:30:00+05:30 IST