ఆటో కార్మికుల పొట్ట కొడుతున్న వైసీపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-11-15T23:17:46+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి ప్రభు త్వం ఆటో కార్మికుల పొట్ట కొడుతోందని సీఈఐటీయూ మండల కన్వీనర్‌ కామ్రేడ్‌ దాసరి జయచంద్ర విమర్శిం చారు.

ఆటో కార్మికుల పొట్ట కొడుతున్న వైసీపీ ప్రభుత్వం
నిరసన తెలుపుతున్న సీఐటీయూ నేతలు

రైల్వేకోడూరు(రూరల్‌) నవంబరు 15: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి ప్రభు త్వం ఆటో కార్మికుల పొట్ట కొడుతోందని సీఈఐటీయూ మండల కన్వీనర్‌ కామ్రేడ్‌ దాసరి జయచంద్ర విమర్శిం చారు. కేంద్ర ప్రభుత్వం బారె డు ధరలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం మూరెడు ధరలు పెంచిందని ఆరోపిం చారు. రోజంతా కష్టపడితే వచ్చే డబ్బులు పెట్రోల్‌ డీజిల్‌కే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధరలు తగ్గించి ఆటో కార్మికులను ఆదుకో వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు హనుమంతు, సుబ్బరాయుడు, వెంకటేష్‌, నాగరాజు, శివశంకర్‌, ఈశ్వర్‌, రమణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-15T23:17:46+05:30 IST

Read more