AP News: వైసీపీకి ఓట్లు లేవు: కేఏ పాల్‌

ABN , First Publish Date - 2022-08-02T03:06:11+05:30 IST

రాష్ట్రంలో వైసీపీకి ఓట్లు లేవు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు గెలిపించరు.

AP News: వైసీపీకి ఓట్లు లేవు: కేఏ పాల్‌

నెల్లూరు: ‘రాష్ట్రంలో వైసీపీకి ఓట్లు లేవు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు గెలిపించరు. నేను ముఖ్యమంత్రి కావాలని 70శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారు’ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని, ప్రస్తుతం అప్పు తెచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. తనను అధికారంలోకి తీసుకువస్తే రూ లక్ష కోట్లతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. తనపై  ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకు జగన్‌ మతతత్వపార్టీ అయిన బీజేపీకి సరెండర్‌ అయ్యారని పాల్‌ దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని మరో శ్రీలంకగా మార్చవద్దని ఆయన జగన్‌కు హితవు పలికారు. అలాగే దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్‌ సంస్థలకు అమ్మేశారని, అవినీతిపరులకు కొమ్ముకాస్తున్నారని, కేంద్రంలోని అవినీతి పాలనకు గుడ్‌బై చెప్పాలన్నారు. దేశంలో 21 రాష్ట్రాల్లో 30 మంది జర్నలిస్టులపై కేసులు నమోదు చేశారని, తాను అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు సొంతఇల్లు నిర్మించి ఇస్తానని పాల్ తెలిపారు.

Read more