హక్కుల పరిరక్షణకే న్యాయవ్యవస్థ

ABN , First Publish Date - 2022-12-12T02:42:17+05:30 IST

రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణే ధ్యేయంగా న్యాయ వ్యవస్థలు పని చేస్తున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు.

హక్కుల పరిరక్షణకే న్యాయవ్యవస్థ

అది కుప్పకూలితే దుష్పరిణామాలు

మాజీ సీజేఐ జస్టిస్‌ రమణ ఆవేదన

సాగర్‌ నగర్‌ (విశాఖ సిటీ), డిసెంబరు 11: రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణే ధ్యేయంగా న్యాయ వ్యవస్థలు పని చేస్తున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. కోర్టులు ఒక్క వివాదాల పరిష్కారానికే కాకుండా సమాజంలోని అసమానతల తొలగింపునకు తీవ్రంగా కృషి చేస్తున్నాయని చెప్పారు. ‘రోటరీ ఇన్‌స్టిట్యూట్‌ విశాఖ వశిష్ట’ పేరుతో రోటరీ క్లబ్‌ రుషికొండ సమీపంలోని ఒక ప్రైవేటు హోటల్‌లో నిర్వహించిన మూడ్రోజుల కార్యక్రమంలో ఆదివారం చివరిరోజు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. న్యాయ వ్యవస్థ కుప్పకూలిపోతే సమాజంలో అనేక దుష్పరిణామాలు ఏర్పడతాయని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇప్పటికీ చాలా మంది ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-12T02:42:18+05:30 IST