-
-
Home » Andhra Pradesh » joint Krishna district TDP budda venkanna andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
AP News: ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ సమావేశంలో లుకలుకలు... అర్ధాంతరంగా వెళ్లిపోయిన బుద్దా
ABN , First Publish Date - 2022-09-13T18:00:43+05:30 IST
ఉమ్మడి కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ సమావేశంలో లుకలుకలు చోటు చేసుకున్నాయి.

విజయవాడ: ఉమ్మడి కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ (TDP) సమావేశంలో లుకలుకలు చోటు చేసుకున్నాయి. సభా వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై బుద్దా వెంకన్న (Budda venkanna) ఫోటో లేకపోవడంతో వెంకన్న, ఆయన అనుచరులు మనస్థాపం చెందారు. ఈ క్రమంలో బుద్దా వెంకన్న (TDP Leader) సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ... పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) కొన్ని రోజుల క్రితం నేతలకు క్లాస్ తీసుకున్నప్పటికీ నాయకుల్లో తీరు మారలేదన్నారు. బ్యానర్‌లో తన ఫోటో లేకపోవడంపై తాను ఏమి మనస్తాపం చెందలేదని చెప్పారు. ఇక్కడ పరిణామాలు తనకు కన్నీరు తెప్పిస్తున్నాయి. చంద్రబాబు (TDP Chief) గెలుపే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. విశాఖపట్నం వెళ్లవలసిన పని ఉండడంతో బయటకు వచ్చినట్లు బుద్దా వెంకన్న వివరించారు.