ఏపీ రాజధాని అమరావతే: పోతిన Mahesh

ABN , First Publish Date - 2022-02-23T17:52:58+05:30 IST

ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతే అని జనసేన నేత పోతిన మహేష్ స్పష్టం చేశారు.

ఏపీ రాజధాని అమరావతే: పోతిన Mahesh

అమరావతి: ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతే అని జనసేన నేత పోతిన మహేష్ స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ భూములు త్యాగం చేసిన అమరావతి రైతులను రోడ్ల మీద నిలబెట్టారని మండిపడ్డారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర చేసిందని విమర్శించారు. ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని కుయుక్తులు పన్నారన్నారు. అధికార వైఎస్సార్సీపీ పార్టీ ఒత్తిళ్లు, బెదిరింపులు, అవమానాలు, కేసులు, మహిళలపై దాడులు చేశారన్నారు. అవాస్తవాలు, అబద్దాల ప్రచారలన్నింటిని అధిగమించి 5 కోట్ల మంది ప్రజల కోసం వేలాది మంది అమరావతి  రైతుల ఉద్యమం చేస్తున్నారన్నారు.  800 రోజుల నిరవధిక ఉద్యమం, పోరాట స్ఫూర్తి, చారిత్రాత్మకమని కొనియాడారు. పవన్ కళ్యాణ్ అమరావతి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు. అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగా వారి ఆందోళనల్లో పాల్గొన్నారని తెలిపారు. అమరావతే రాష్ట్ర రాజధాని అని.. రైతులకు జనసేన మద్దతు ఎప్పుడూ ఉంటుందని పోతిన మహేష్ పేర్కొన్నారు. 
Read more