రోడ్డు మీద ప్రయాణం సర్కస్ ఫీట్... Pawan మరో వ్యంగ్య ట్వీట్

ABN , First Publish Date - 2022-07-15T14:46:18+05:30 IST

రాష్ట్రంలోని నెలకొన్న పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్య ట్వీట్లతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

రోడ్డు మీద ప్రయాణం సర్కస్ ఫీట్... Pawan మరో వ్యంగ్య ట్వీట్

అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) వ్యంగ్య ట్వీట్లతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రోజుకో ట్వీట్‌తో రాష్ట్రంలో వైసీపీ పరిపాలన ఏ విధంగా ఉందో తెలియజేస్తున్నారు. తాజాగా రోడ్ల అధ్వాన్న స్థితిపై ఛిద్రమైన రహదారి  అంటూ ఓ వీడియోతో పాటు... ప్రత్యేక వ్యంగ్య చిత్రాన్ని ట్వీట్ చేశారు. #GoodMorningCMSir అనే డిజిటల్ క్యాంపెయిన్‌లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.  రావులపాలెం నుంచి అమలాపురం వెళ్ళే రోడ్డు దుస్థితిని తెలిపే వీడియోను జనసేనాధిపతి ట్విటర్‌లో పోస్టు చేశారు. కొత్తపేట దగ్గర ఉన్న గుంతలు, అక్కడి పరిస్థితి ఈ వీడియోలో తెలుస్తోందంటూ పోస్ట్‌ చేశారు. దానికి #GoodMorningCMSir అని హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు. 


ట్వీట్‌లో ఏముందంటే...

రోడ్డు మీద ప్రయాణం సర్కస్ ఫీట్‌లా ఉంటుంది. రాష్ట్రంలో రోడ్డు ప్రయాణం ఎంత నరకప్రాయంగా మారిందో తెలుస్తుంది. హెలికాప్టర్‌లో వెళ్తున్న సీఎం రోడ్డు మీద ద్విచక్ర వాహనాలపై వెళ్ళే వాళ్ళను వింతగా చూస్తుంటారు. ఒక్కో గోతిలో నుంచి గాల్లో ఎగిరి అంతా దూరాన మరో గోతిలో ఉన్న నీళ్ళలో పడుతుంటే... వారి వాహనాలు గాల్లో ఉన్నట్లు ఆ వ్యంగ్య చిత్రం ఉంది. రాష్ట్రంలో రోడ్లపై ప్రయాణిస్తున్నవారి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో కార్టూన్ ద్వారా అర్ధమవుతుంది.Updated Date - 2022-07-15T14:46:18+05:30 IST

Read more