Pawan Kalyan: శ్వాస కూడా తీసుకోనివ్వరా?

ABN , First Publish Date - 2022-12-10T02:40:00+05:30 IST

వచ్చే ఎన్నికల కోసం సిద్ధం చేసుకున్న తన ప్రచారం రథం ‘వారాహి’పై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై ట్విటర్‌ వేదికగా పలు దఫాలుగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

Pawan Kalyan: శ్వాస కూడా తీసుకోనివ్వరా?

వైసీపీపై జనసేనాని ఆగ్రహం

‘వారాహి’పై విమర్శలకు పవన్‌ గట్టి కౌంటర్‌

అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల కోసం సిద్ధం చేసుకున్న తన ప్రచారం రథం ‘వారాహి’పై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై ట్విటర్‌ వేదికగా పలు దఫాలుగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ముందుగా తన సినిమాలను అడ్డుకున్నారని, విశాఖ వెళ్తే హోటల్‌ గది నుంచి బయటకు రాకుండా నిరోధించారని, అక్కడి నుంచి బలవంతంగా పంపేశారని, మంగళగిరిలో తాను కారులో వెళ్తుంటే అడ్డుకున్నారని.. ఇప్పటం గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుంటే అడ్డుకున్నారని.. ఇప్పుడు వాహనం రంగుపైనా వివాదం చేస్తున్నారని ఆగ్రహించారు. ‘‘కనీసం ముదురు ఆకు పచ్చచొక్కా వేసుకోవచ్చా.. ఇకపై శ్వాస తీసుకోవడం ఆపేయమంటారా?’’ అని నిలదీశారు. ట్విటర్‌లో చెట్ల ఫొటోను ట్వీట్‌ చేసి ఇందులో ఏ రంగు వేయాలని ప్రశ్నించారు. రూల్స్‌ ఒక్క పవన్‌ కల్యాణ్‌ కోసమేనా అంటూ.. ఆలివ్‌ కలర్‌లో ఉన్న కార్ల ఫొటోలను ట్వీట్‌ చేశారు.

Updated Date - 2022-12-10T02:44:17+05:30 IST