జగన్‌ది అవినీతి వారసత్వం

ABN , First Publish Date - 2022-11-30T03:15:23+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నిత్య అవినీతిపరుడని, ఆయన తాతల కాలం నుంచి అవినీతి వారసత్వంగా వస్తోందని మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి వెంకట హరిరామజోగయ్య విమర్శించారు.

జగన్‌ది అవినీతి వారసత్వం

హరిరామజోగయ్య

పవన్‌ కల్యాణ్‌ పవర్‌ కల్యాణ్‌ అవుతాడని వ్యాఖ్య

పాలకొల్లు, నవంబరు 29: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నిత్య అవినీతిపరుడని, ఆయన తాతల కాలం నుంచి అవినీతి వారసత్వంగా వస్తోందని మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి వెంకట హరిరామజోగయ్య విమర్శించారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కంటే జగన్‌ ముఖ్యమంత్రిగా పదింతలు ఎక్కువ సంపాదించాడని, జగన్‌ నిత్య అవినీతి పరుడుగా అభివర్ణించవచ్చునని పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2004లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి అడ్డదారిలో జగన్‌ అవినీతికి పాల్పడడ్డారన్నారు. అవినీతి సొమ్ముతోనే సాక్షి పేపరు, సాక్షి టెలివిజన్‌ నెలకొల్పారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రానున్న రోజుల్లో పవర్‌ కల్యాణ్‌గా మారుతారని ఆయన విశ్లేషించారు. జగన్‌ అవినీతిని ఎండగట్టడం ద్వారా పవన్‌ యువతరాన్ని ఆకట్టుకోవాలన్నారు. జగన్‌ పాలనలో డీజీపీ నుంచి ప్రభుతత్వ చీఫ్‌ సెక్రటరీ వరకు అన్నీ రెడ్డి కులస్థులకే ఇచ్చారని విమర్శించారు. రాజధానిగా అమరావతినే ప్రకటించాలని డిమాండ్‌ జోగయ్య చేశారు.

Updated Date - 2022-11-30T03:15:24+05:30 IST