Pulivendulaలో జగన్ పర్యటన... పోలీసుల అత్యుత్సాహం

ABN , First Publish Date - 2022-07-07T16:42:24+05:30 IST

జిల్లాలోని పులివెందులలో సీఎం పర్యటిన నేపథ్యంలో పోలీసులు, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

Pulivendulaలో జగన్ పర్యటన... పోలీసుల అత్యుత్సాహం

కడప: జిల్లాలోని పులివెందులలో సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy) పర్యటన సందర్భంగా పోలీసులు(Police), అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సొంతనియోజకవర్గం పులివెందులలో కూడా ప్రధానరోడ్లపై భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలను దూరం పెట్టేందుకే బారికేడ్లు ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఉన్నఫలంగా మీడియాకు అనుమతి నిరాకరించారు. కాగా బారికేడ్ల ఏర్పాటుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమస్యలపై ప్రజలు ప్రశ్నిస్తారేమో అని అందుకే పకడ్బంది చర్యలు చేపట్టారని ప్రతిపక్షాలు చర్చించుకుంటున్నాయి. 

Updated Date - 2022-07-07T16:42:24+05:30 IST