జగన్‌, విజయసాయి బీజేపీకి కాపలా కుక్కలు: రామకృష్ణ

ABN , First Publish Date - 2022-09-08T09:13:35+05:30 IST

జగన్‌, విజయసాయి బీజేపీకి కాపలా కుక్కలు: రామకృష్ణ

జగన్‌, విజయసాయి బీజేపీకి కాపలా కుక్కలు: రామకృష్ణ

అనంతపురం విద్య, సెప్టెంబరు 7: ‘‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రధాని మోదీ, అమిత్‌షాను చూస్తే ప్యాంట్లు తడిసిపోతున్నాయి. వారు బీజేపీకి కాపలా కుక్కల్లా వ్యవహరిస్తున్నారు’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్‌ అయ్యారు. అనంతపురంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘‘దేశంలో ప్రజాస్వామాన్ని బీజేపీ తుంగలోతొక్కుతోంది. ప్రభుత్వాలను పడగొట్టి, సీబీఐ, ఐటీ రైడ్స్‌ చేయించి వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ పాదయాత్ర చేస్తుంటే విజయసాయిరెడ్డి విమర్శించడం ఏమిటి? పోలవరం ప్రాజెక్టుకు భూములిచ్చి, సర్వస్వం త్యాగం చేసిన వారు 21 రోజులుపాటు నీళ్లలో ఇబ్బందులు పడితే ప్రభుత్వం గాడిదలు కాసిందా? ఈ మూడేళ్లలో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. సీఎం చెప్పినట్లు చకచకా పనులు సాగడం లేదు... చకచకా ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయి. రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు ఆగడంలేదు. లేపాక్షి హబ్‌ అన్యాయంపై రైతుల పక్షాన పోరాటం చేస్తాం’’ అని రామకృష్ణ ప్రకటించారు. 

Read more