ఖబడ్దార్ మిస్టర్ జగన్‌రెడ్డి..: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-08-25T18:04:53+05:30 IST

ఖబడ్దార్ మిస్టర్ జగన్‌రెడ్డి.. అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కుప్పంలో వైసీపీ శ్రేణులు సృష్టించిన

ఖబడ్దార్ మిస్టర్ జగన్‌రెడ్డి..: చంద్రబాబు

చిత్తూరు: ఖబడ్దార్ మిస్టర్ జగన్‌రెడ్డి(Mr. Jagan Reddy).. అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) హెచ్చరించారు. కుప్పంలో వైసీపీ(YCP) శ్రేణులు సృష్టించిన అరాచాకంపై తీవ్రస్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‎(Andhra Pradesh)లో వైసీపీ అరాచకాలు పేట్రేగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కార్ రాష్ట్రంలో వీధికో రౌడీని తయారు చేసిందని మండిపడ్డారు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్నే ధ్వంసం చేస్తారా? అంటూ మండిపడ్డారు. ఈరోజు కుప్పం చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?.. రాష్ట్రాన్ని వైసీపీ అతలాకుతలం చేయాలని చూస్తోందన్నారు. కుప్పం నుంచే ధర్మపోరాటం మొదలుపెట్టానని, తనపైనే దాడి చేయాలని ప్రయత్నించారని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 


‘‘పోలీసులను అడ్డుపెట్టుకుని రౌడీయిజం చేస్తారా? పోలీసులు ఉన్నది మమ్మల్ని కొట్టడానికా? ఇంత జరుగుతున్నా ఎస్పీ ఎక్కడున్నావ్? మా కార్యకర్తలపై దాడులు కనిపించడం లేదా? జగన్‌రెడ్డి చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా తయారయ్యారు. బాదుడే బాదుడు కార్యక్రమం చూసి వైసీపీ ప్రభుత్వం తట్టుకోలేకపోతున్నారు. గూండాలకు గుణపాఠం చెప్పిన పార్టీ తెలుగుదేశం. అక్రమ కేసులకు భయపడతామనుకుంటున్నావా? నేను బ్రతికి ఉన్నంతవరకు మీరేమీ చేయలేరని సీఎం జగన్ మోహన్ రెడ్డిని’’ మరోసారి చంద్రబాబు హెచ్చరించారు.

Read more