-
-
Home » Andhra Pradesh » jagan lokesh bbr-MRGS-AndhraPradesh
-
AP News: మా చిన్నమ్మ మరణంపై విషప్రచారం చేయిస్తున్నారు: లోకేష్
ABN , First Publish Date - 2022-08-03T22:34:45+05:30 IST
సీఎం జగన్ (Jagan) తన క్రిమినల్ రూపాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని టీడీపీ నేత లోకేష్ (Lokesh) మండిపడ్డారు.

అమరావతి: సీఎం జగన్ (Jagan) తన క్రిమినల్ రూపాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని టీడీపీ నేత లోకేష్ (Lokesh) మండిపడ్డారు. ‘‘డోర్ నెంబర్‌కు సర్వే నెంబర్‌కు తేడా తెలియని కిరాయిగాళ్లతో మా చిన్నమ్మ మరణంపై విషప్రచారం చేయిస్తున్నారు. కోడికత్తి డ్రామా, బాబాయ్ గుండెపోటు అంటూ ఆస్కార్ రేంజ్ నటన, ఒకే కులం డీఎస్పీలకు ప్రమోషన్లు, పింక్ డైమండ్ పేరుతో విషప్రచారం చేశారు. నేడు తప్పుడు సర్వే నెంబర్లు సృష్టించి మా చిన్నమ్మ మరణంపై విషప్రచారం చేయబోయి బొక్కబోర్లా పడ్డారు’’ అని లోకేష్ దుయ్యబట్టారు. తండ్రి శవాన్ని అడ్డుపెట్టుకుని సీఎం కావాలని సంతకాలు చేసిన నీచ చరిత్ర జగన్‌దని ద్వజమెత్తారు. ఎన్నికల్లో సానుభూతి కోసం బాబాయ్ మరణాన్ని వాడుకున్నారని, జనాన్ని దోచుకుని, నెత్తుటి కూడు తింటూ.. తరతరాల రక్తచరిత్రకు వారసుడు జగన్‌రెడ్డేనని చెప్పారు. చిన్నమ్మ ఉమామహేశ్వరి మరణంతో తాము విషాదంలో ఉంటే.. విషప్రచారం చేస్తూ వినోదం పొందుతారా? అని ప్రశ్నించారు. వైసీపీ (YCP) నేతల పైశాచిక ఆనందానికి ఎక్స్‌పెయిరీ డేట్ దగ్గర పడింది జగన్‌రెడ్డి అని లోకేష్ హెచ్చరించారు.