Chandrababu: చెత్త సీఎం జగన్

ABN , First Publish Date - 2022-12-30T19:52:31+05:30 IST

సీఎం జగన్ (CM Jagan) ప్రజలను బానిసలు అనుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తప్పుబట్టారు.

Chandrababu: చెత్త సీఎం జగన్

నెల్లూరు: సీఎం జగన్ (CM Jagan) ప్రజలను బానిసలు అనుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తప్పుబట్టారు. జగన్ ఇప్పటికైనా మారకపోతే.. ఇంటికెళ్లడం ఖాయమని హెచ్చరించారు. రాష్ట్రంలోఅన్నింటా బాదుడే బాదుడు.. ధరల భారంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. వంటనూనెనులు కొని వంటలు చేసే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. కరెంట్ చార్జీలు, ఆర్టీసీ, రిజిస్ట్రేషన్ (RTC Registration), ఇంటి పన్నులు పెరిగాయని, చెత్త మీద పన్ను వేసిన చెత్త సీఎం జగన్ అని మండిపడ్డారు. ఖర్చులు పెరిగి జనం అప్పుల పాలయ్యారని, జగన్ రెడ్డి అబద్ధాల కోరని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎవరూ ఆనందంగా లేరని, సమయం లేదని ఉపేక్షిస్తే సర్వనాశనం అవుతామని చంద్రబాబు హెచ్చరించారు.

‘‘జగన్ రెడ్డికి సుపరిపాలన తెలియదు. రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదు. రాష్ట్రంలో కౌలుకు వచ్చే వారు లేరు. జగన్ నెల్లూరు (Nellore)కు వస్తే.. రైతులకు నేనేం చేశానో చెబుతా. రాష్ట్ర ప్రజల ఖర్మకు బాధ్యుడు జగన్రెడ్డి. ఓ వైపు వరి.. మరోవైపు ఆక్వా కల్చర్ దెబ్బతిన్నాయి. చేతనైతే రైతుల సమస్యలు పరిష్కరించాలి.. లేదంటే జగన్ రెడ్డి గద్దె దిగాలి. వెనుకబడి వర్గాలు, చేనేత కార్మికులు రోడ్లెక్కారు. వెనుకబడిన వర్గాలు అన్నిరకాలుగా నష్టపోయారు. రాబోయే రోజుల్లో బీసీలను ఆదుకునే బాధ్యత నాది. రాష్ట్రంలో ఎస్సీలపైనా దాడులు జరిగాయి. యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయిస్తాం. వైసీపీని ఇంటికి పంపాలి.. టీడీపీని గెలిపించుకోవాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Updated Date - 2022-12-30T19:52:41+05:30 IST