-
-
Home » Andhra Pradesh » jagan inaugurated ranko cement factory in nandyala andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
Jagan mohanreddy: నంద్యాలలో రాంకో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన జగన్
ABN , First Publish Date - 2022-09-28T19:37:24+05:30 IST
జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం కల్వటాలలో సీఎం జగన్ (CM Jagan) బుధవారం పర్యటించారు.

నంద్యాల: జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం కల్వటాలలో సీఎం జగన్ (CM Jagan) బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా రాంకో సిమెంట్ ఫ్యాక్టరీని జగన్(YS Jagan mohan reddy) ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... రూ.2,500 కోట్ల పెట్టుబడితో వెయ్యి మందికి పరిశ్రమలో ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు రాంకో సిమెంట్స్ ఉదాహరణగా చెప్పుకొచ్చారు. రైతులకు ఎకరాకు రూ.30 వేలు లీజు ఇచ్చి సోలార్, విండ్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరుసగా 3 ఏళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్ నిలిచామన్నారు. పారిశ్రామిక వేత్తలకు ఏపీ ప్రభుత్వం (AP government) అండగా ఉందని భరోసా ఇచ్చారు. దేశంలోనే 11.43 వృద్ధి రేటుతో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో మరో 4 పోర్టులు, 3 ఇండస్ట్రియల్ కారిడార్ పనులు వేగంగా జరుగుతున్నట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM) వెల్లడించారు.