సోషల్ మీడియా పటిష్టతపై జగన్ ఫోకస్

ABN , First Publish Date - 2022-09-13T18:40:10+05:30 IST

సోషల్ మీడియా(Social Media) పటిష్టతపై సీఎం జగన్(CM Jagan) ఫోకస్ పెట్టారు. సోషల్ మీడియా బాధ్యతలు చూడటానికి

సోషల్ మీడియా పటిష్టతపై జగన్ ఫోకస్

Amaravathi : సోషల్ మీడియా(Social Media) పటిష్టతపై సీఎం జగన్(CM Jagan) ఫోకస్ పెట్టారు. సోషల్ మీడియా బాధ్యతలు చూడటానికి తెరపైకి కొత్త పేరు వచ్చింది. సజ్జల తనయుడు సజ్జల భార్గవరెడ్డి(Sajjala Bhargava Reddy)కి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్ ఆధ్వర్యంలో భార్గవ్, సోషల్ మీడియా వింగ్ నేతలు(Socia Media Wing leaders) భేటీ అయ్యారు. సోషల్ మీడియాతో పాటు పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతను ఇప్పటి వరకూ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) చూస్తూ వస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాల దాడి, ఆరోపణలు పెరుగుతుండడంతో కౌంటర్ స్ట్రాటజీ టీమ్ అవసరమని సీఎం జగన్ భావిస్తున్నారు. నిజానికి ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా టీం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఏదైనా ఆరోపణ వచ్చినా.. కౌంటర్ వచ్చినా.. క్షణాల్లో తిరిగి కౌంటర్ ఇచ్చేస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటంతో పాటు ఆరోపణలు పెరుగుతుండటంతో ఇక సోషల్ మీడియాను మరింత పటిష్టం చేయాలని జగన్ యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వింగ్ నేతలతో భేటీ అయ్యారు.

Read more