జగన్‌కు చంద్రబాబుపై కోపం ఉంటే ఆయనపై చూపించుకోవాలి: రామకృష్ణ

ABN , First Publish Date - 2022-03-04T21:38:30+05:30 IST

అమరావతి రాజధానిగా ఉండాలనేది ప్రజల ఆకాంక్ష అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో అమరావతి పట్ల సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరించారని దుయ్యబట్టారు.

జగన్‌కు చంద్రబాబుపై కోపం ఉంటే ఆయనపై చూపించుకోవాలి: రామకృష్ణ

అమరావతి: అమరావతి రాజధానిగా ఉండాలనేది ప్రజల ఆకాంక్ష అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో అమరావతి పట్ల సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబుపై కోపం ఉంటే ఆయనపై చూపించుకోవాలన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలీదని ఎద్దేవాచేశారు. రాజధాని గ్రామాల్లో బడుగు, బలహీన వర్గాలు లేవా? అని రామకృష్ణ ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని తప్పుబట్టారు. జగన్ హైకోర్టు తీర్పును గౌరవించాలని రామకృష్ణ కోరారు.


అమరావతికి జయము’ ఇది న్యాయ దేవత పలికిన మాట!  వైసీపీ సర్కారుకూ, అమరావతికీ జరిగిన న్యాయ పోరాటంలో... అమరావతినే విజయం వరించింది. పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడుతున్న రాజధాని రైతులకు అతి పెద్ద ఊరట లభించింది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని... రైతులతో కుదుర్చుకున్న చట్టబద్ధ ఒప్పందం ప్రకారం వారికి కేటాయించిన ప్లాట్లను అభివృద్ధి చేయించి ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైసీపీ సర్కారు రాగానే మూలన పడిన అమరావతికి మళ్లీ ప్రాణం పోసింది.

Read more